తాజాగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యాయి.. ఆషాడ మాసం రాగానే ఈదురుగాలులతో వర్షాలు అక్కడక్కడ పడతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ముందే వర్షాలు మొదలవడం గమనార్హం. నైరుతి విస్తరించడంతో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే సముద్రం నుంచి వచ్చే ప్రేమ గాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో పలుచోట్ల వర్షాలు కురిసాయి.

ఇకపోతే మరో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని గుంటూరు, ఎన్టీఆర్ , అన్నమయ్య,  పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ ప్రాంతాలలో అధిక వర్షాలు నమోదు కాగా మొలకలచెరువులో 120.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు.

ఇకపోతే గురువారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం , పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్,  కృష్ణ , గుంటూరు, బాపట్ల, పల్నాడు,  ప్రకాశం జిల్లాలలో కొన్నిచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. అలాగే విజయనగరం,  అనకాపల్లి, శ్రీకాకుళం , తిరుపతి, కాకినాడ , నెల్లూరు , చిత్తూరు,  సత్యసాయి, అనంతపురం,  వైఎస్ఆర్, కర్నూలు , నంద్యాల, అన్నమయ్య జిల్లాలలో కూడా కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇక హైదరాబాదులో కూడా నిన్న సాయంత్రం నుంచి వర్షం పడడం ప్రారంభం అయింది. హైదరాబాద్ సిటీలోని దిల్ సుఖ్ నగర్ , సైదాబాద్,  జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మల్కాజ్ గిరి , హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో వర్షాలు బాగా పడ్డాయి. ఇక ప్రజలు వర్షాల నుంచి అప్రమత్తంగా ఉండాలి అని రైతులకు కూడా తమ పంట విషయంపై జాగ్రత్త వహించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: