సినీ పరిశ్రమ చాలా విచిత్రమైనది ఒక మాయాజాలం లాంటిది. ఇక్కడ మ్యాజిక్ లు చాలానే జరుగుతుంటాయి. ఏ అవకాశం ఎప్పుడు ఎవర్ని ఏ స్థాయికి చేరుస్తుంది అన్నది ఎవరు ఊహించలేరు. ఒక కథలో హీరో , హీరోయిన్లను ముందుగా అనుకుంటారు అయితే వారు పలు కారణాల వలన వారితో కుదరకపోతే వేరే నటుల దగ్గరకు ఆ ఛాన్స్ లు తారుమారు అవుతాయి. కొన్నిసార్లు ఏ అంచనాలు లేని సినిమాలు, కొన్ని పాత్రలు ఊహించని స్థాయిలో సక్సెస్ ను అందుకుంటాయి. అలాంటప్పుడు ఆ సినిమాలలో ఛాన్స్ లు మిస్ చేసుకున్న నటులు సినిమా రిలీజ్ అయ్యాక చాలా బాధపడుతుంటారు. అప్పుడు ఎలాగోలా చేసి ఉండాల్సింది అని అనుకుంటుంటారు.

ఇలాగే తాను కొన్ని మంచి ఛాన్స్ లను మిస్ చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ప్రముఖ సీనియర్ నటి అర్చన. ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా కాలం నుండే ఉంది, పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే ఇప్పటికీ తగిన గుర్తింపు అందలేదు. ఒకవేళ అపుడు కనుక నేను అందుకు ఒప్పుకుని ఉంటే ఇపుడు నా కెరియర్ వేరేలా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల తార. తాజాగా ఓ ఇంటి హాజరైన అర్చన తన మిస్ చేసుకున్న పాత్ర గురించి చెబుతూ బాధపడ్డారు.

మగధీర సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అందులో మిత్రవింద పాత్రలో హీరోయిన్ గా చేసిన కాజల్ కి ఆ ఆ పాత్ర ఎంతటి స్టార్ డం ను తెచ్చిపెట్టిందో తెలిసిందే. అయితే ఆ పాత్రను మొదట తనను చేయమని అడిగారట దర్శకుడు రాజమౌళి. కానీ డేట్స్ కుదరక పోవడంతో ఛాన్స్ మిస్ అయ్యాయని తెలిపింది. అప్పుడు కనుక ఆ సినిమా చేసుంటే చాలా బాగుండేదని అభిప్రాయపడింది. అలాగే మర్యాద రామన్న సినిమాలో సలోని పాత్ర కూడా ముందుగా తనకే ఆఫర్ ఇచ్చారట జక్కన్న కానీ అపుడు మిస్ అయ్యిందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: