BMW గ్రూప్ ఇండియా గురువారం కొత్త bmw M4 కాంపిటీషన్ కూపేని విడుదల చేసింది. లగ్జరీ హై-పెర్ఫార్మెన్స్ కూపే కారు ఒకే పెట్రోల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇంకా దీని ధర ₹143,90,000 (ఎక్స్-షోరూమ్). జర్మన్ లగ్జరీ కార్ మార్క్యూ ఈ హై పెర్ఫార్మన్స్ గల స్పోర్ట్స్ కూపేను పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా భారతదేశంలో అమ్ముతుంది.సరికొత్త bmw M4 కాంపిటీషన్ స్కైస్క్రాపర్ గ్రే, పోర్టిమావో బ్లూ, బ్లాక్ సఫైర్, సావో పాలో ఎల్లో, టొరంటో రెడ్ మరియు ఆల్పైన్ వైట్ వంటి అనేక రంగు ఎంపికలలో నాన్-మెటాలిక్‌లో అందుబాటులో ఉంది. అలాగే, bmw ఇండియా ఆప్షనల్ మెటాలిక్ పెయింట్ ఫినిషింగ్‌లను అందిస్తోంది. అవి - టాంజానైట్ బ్లూ, డ్రావిట్‌గ్రే, అవెంచురిన్ రెడ్, ఫ్రోజెన్ బ్రిలియంట్ వైట్, ఫ్రోజెన్ పోర్టిమావో బ్లూ. అంతే కాకుండా, ఆటోమేకర్ బిఎమ్‌డబ్ల్యూ ఇండివిజువల్ స్పెషల్ పెయింట్‌వర్క్స్ ఫ్రోజెన్ ఆరెంజ్, ఫ్రోజెన్ బ్లాక్, ఫ్రోజెన్ డీప్ గ్రే వంటి వాటిని కూడా అందిస్తోంది.BMW M4 కాంపిటీషన్ క్యాబిన్ కోసం ఆటోమేకర్ అనేక అప్హోల్స్టరీ ఎంపికలను కూడా అందిస్తోంది.

వీటిలో యాస్ మెరీనా బ్లూ, క్యాటమి ఆరెంజ్, సిల్వర్‌స్టోన్, బ్లాక్ కలయికలో పొడిగించిన కంటెంట్‌లతో కూడిన M లెదర్ 'మెరినో' ఉన్నాయి. కారు అడాప్టివ్ LED హెడ్‌లైట్‌లు మరియు bmw లేజర్‌లైట్‌తో కూడిన పదునైన డిజైన్‌ను స్టాండర్డ్‌గా పొందుతుంది. మంచి స్లాట్‌లతో కూడిన ఫ్రంట్ కిడ్నీ గ్రిల్ సమకాలీన bmw మోడల్‌లకు అనుగుణంగా ఉంటుంది. కారు చంకీ వీల్ ఆర్చ్‌లను, ప్రముఖంగా పొడిగించబడిన సైడ్ సిల్స్‌ను కూడా పొందుతుంది. ముందు మరియు వెనుక అప్రాన్లు కూడా కారుకు మంచి డేరింగ్ లుక్స్ యాడ్ చేస్తాయి. ఇది  వింగ్ మిర్రర్‌లను పొందుతుంది, అవి ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేయబడ్డాయి మరియు హై -గ్లోస్ బ్లాక్ పెయింట్‌లో వస్తాయి. ఇది స్పోర్ట్స్ ఏరోడైనమిక్ ఫిన్స్, రియర్ స్పాయిలర్ మరియు బ్లాక్ క్రోమ్‌లో పూర్తి చేసిన టూ పైర్స్ ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్‌లను కూడా పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: