సాధారణంగా ప్రతి ఒక్కరూ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం,  మార్కెట్లో దొరికే వివిధ రకాల కాస్మొటిక్స్,  క్రీమ్స్ ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మచ్చలు లేని ముఖము పొందడానికి వారు పడే తపన అంతా ఇంతా కాదు. వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ  ముఖాన్ని అందంగా తీర్చి దిద్దుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే,  అమ్మాయి అందాన్ని మరింత అందవిహీనంగా మార్చేది అవాంఛితరోమాలు.. ఈ అవాంఛిత రోమాల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు మహిళలు.. అయితే ముఖం నుండి అదనపు జుట్టును తొలగించడానికి మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. అందుకోసమే ఇంట్లో తయారుచేసిన పౌడర్ లతోనే ఈ సమస్యను సులభంగా తొలగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


కావలసిన పదార్థాలు :
రెండు టేబుల్ స్పూన్ల బీన్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు పొడి, మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చివరగా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె..


దీనిని ఎలా తయారు చేయాలి..?
ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపినప్పుడు చివరగా వచ్చేది జిడ్డుగల పసుపు పేస్ట్. మీ చర్మం పై అధికంగా జుట్టు పెరుగుదల ఉంటే ఈ సమస్యను మీరు పరిష్కరించవచ్చు.. ఈ పేస్ట్ ను అప్లై చేయడం వల్ల  ముఖం మీద వచ్చే ఇతర చర్మ వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు..


ఎలా ఉపయోగించాలి..?
ముఖం మీద ఈ పేస్ట్ ను మందపాటి పొరలాగ అప్లై చేయాలి. అంతే కాకుండా ముఖం మీద ఎక్కడైతే అవాంఛితరోమాలు ఉన్నాయో, ఆ ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి, మెత్తగా మునివేళ్ళతో, సుతిమెత్తగా  వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు వదిలేసి, ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.. ఇక ఇలా తరచూ చేస్తుండడం వల్ల అతి తక్కువ సమయంలోనే అవాంఛితరోమాలు రాలిపోవడం గమనించవచ్చు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: