టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ (52) కన్నుమూశారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య కుదుట పడకపోవడంతో  2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్ యాదవ్.. కామెడీ పాత్రలతోనూ, విలన్‌ పాత్రలతోనూ నటించి మెప్పించారు.

దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఈ నటుడు తన హావభావాలు, డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ నిర్మల దర్శక, నిర్మాణంలో వచ్చిన "హేమాహేమీలు" చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషాలోనూ మంచి పాత్రతో ప్రేక్షకులను అలరించాడు.

 ఆయన నటించిన సినిమాలలో  క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు,‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయన చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. గత 25 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్నారు నర్సింగ్ యాదవ్. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు.  1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. ఈయన మృతిపై సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం తెలియచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: