తెలంగాణలోని పాలంపేటలోని 13 వ శతాబ్దపు రామప్ప ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తించారు. ఈ మేరకు కమిటీ యొక్క ఆన్‌లైన్ సమావేశంలో ఈ శాసనాన్ని ప్రతిపాదించగా, దీనిని నార్వే వ్యతిరేకించింది. అయినప్పటికీ రుష్య వంటి దేశాల ఏకాభిప్రాయం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.   ఈ నిర్ణయానికి 17 దేశాలతో ఏకాభిప్రాయం కుదిరాక యునెస్కో ధ్రువీకరించింది. ఇంతకుముందే ఈ ప్రతిపాదనను పెట్టినప్పటికీ అందులో కొన్ని లోపాలు ఉండటం తో తిరస్కరించబడింది. కానీ ఎట్టకేలకు యునెస్కో ఆదివారం రోజు ఈ హోదాను ప్రకటించింది.  ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ద్వారా రామప్ప దేవాలయానికి  హోదా ఇచ్చినట్టు యునెస్కో ట్వీట్ చేసింది. అతి తక్కువ ప్రదేశాలకు ఇలాంటి గుర్తింపు వస్తున్న నేపథ్యంలో పురాతన రామప్ప గుడికి వచ్చిన గుర్తింపు వలన స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: