భార‌త‌ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. అక్టోబ‌ర్ 29 నుంచి న‌వంబ‌ర్ 02 వ‌ర‌కు ఇట‌లీ, బ్రిట‌న్‌ల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు మోడీ.  ఇటలీలోని రోమ్లో 16వ జీ-20 శిఖరాగ్ర స‌ద‌స్సు అక్టోబర్‌ 30-31 తేదీల్లో జ‌రుగ‌నున్న విష‌యం విధిత‌మే. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు మోడీ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాల అధినేతలు ఈ సదస్సుకు హాజ‌ర‌వ్వ‌నున్నారు.

మోడీ ఇట‌లీ ప‌ర్య‌ట‌న త‌రువాత గ్లాస్‌గౌలో నిర్వ‌హించే కాప్‌-26 ప్ర‌పంచ నేత‌ల స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు బ్రిట‌న్ వెళ్ల‌నున్నారు.  ఈ సమావేశానికి హాజరు కావాల‌ని బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ మోడీని ఆహ్వానించారు. అక్టోబర్‌ 31 నుండి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.  ఇందులో భాగంగానే ‘ప్రపంచ నేతల సదస్సు’ నవంబరు 1-2 మధ్య జరగనున్న‌ది. ఈ స‌ద‌స్సులో మోడీ పాల్లొంటారు. ఈ సదస్సుకు బ్రిటన్,  ఇటలీ అధ్యక్షత వహించనున్నాయి. ఇందులో 120పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హాజ‌ర‌వుతున్న 8వ జీ-20 స‌ద‌స్సు కావ‌డం విశేషం. తొలిసారిగా 2023లో జీ-20 స‌ద‌స్సుకు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ స‌మావేశంలో మూడు ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ తో పాటు వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: