ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ముమ్మరం చేస్తూనే ఉంది. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన స్విస్‌ బ్యాంకుల సహకారం కోరారు. సంపన్నులు ఈ బ్యాంకులో డబ్బు దాచుకుంటారన్న సంగతి తెలిసిందే. సంపన్నులే కాదు.. అనేక దేశాలు కూడా స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తాయి. అందుకే.. రష్యన్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్విట్జర్లాండ్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యాపై పోరాటంలో కలసి రావాలని స్విస్‌ బ్యాంకులను జెలెన్‌ స్కీ కోరారు.  ఇప్పటికే రష్యా ఉక్రెయిన్‌ పై యుద్ధం కారణంగా అనేక అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్విస్ బ్యాంకులు కూడా రష్యా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే.. ఆ దేశం మరింత ఇబ్బందులు పడటం ఖాయం. అయితే ఇలాంటి వ్యూహాలు పుతిన్‌లో మార్పు తెస్తాయా.. ఆయన దూకుడును తగ్గించగలుగుతాయా అన్నది అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: