దేశంలోనే అత్యంత ధనవంతుడు అలాగే ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఏది చేసినా కూడా ఖచ్చితంగా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన వ్యాపారాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా చాలా రిచ్ గా ఉండి ఎప్పుడు వార్తల్లో  నిలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముకేష్ అంబానీ నివాసం ఉండే ఆంటీలియా భవనం గురించి చాలా వింతలు విశేషాలు మీడియాలో స్ప్రెడ్ అవ్వటం గురించి మనం ఇదివరకే చాలా విన్నాం. అయితే తాజాగా ఆయన భవనంలో పనిచేసే సిబ్బంది గురించి ఎన్నో విషయాలు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ముకేశ్ అంబానీ నివాసం  ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనాల్లో ఒకటి.ఇక ఈ భవనంలోనే ముకేశ్ అంబానీ కుటుంబం గత 11 సంవత్సరాలుగా నివాసం ఉంటుంది. మొత్తం 27 అంతస్తుల ఈ భవనం దాదాపు 173 మీటర్ల పొడవులో ఉంటుంది.ముంబైలోని కుంభల హిల్స్ లో ఉన్న ఈ భవనం నిర్మాణం 2012లో పూర్తయింది. ఇక అదే సంవత్సరం ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ భవనంలోకి షిఫ్ట్ అయింది.


మొత్తం నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవంతిలో  మొత్తం 168 కారులు పట్టే అతి పెద్ద గ్యారేజీ ఉండటం విశేషం. ఇంకా అలాగే తొమ్మిది హై స్పీడ్ ఎలివేటర్స్,టెర్రస్,గార్డెన్స్,స్విమ్మింగ్ పూల్ ఇంకా స్పా హెల్త్ సెంటర్, థియేటర్ ఇంకా అలాగే ఒక ఆడిటోరియం ఉండటం కూడా విశేషం.ఇక ఈ యాంటీలియా భవనంలో సుమారు 600 మంది స్టాఫ్ పనిచేస్తారు. వీరందరికి కూడా జీతభత్యాలను ముఖేష్ అంబానీ కుటుంబం బాగా చెల్లిస్తుంది. ఇక ముఖేష్ అంబానీ కుటుంబానికి సకల సౌకర్యాలు చేసే ఈ సిబ్బందికి వేతనాలు ఏ విధంగా ఉంటాయో తెలిస్తే నిజంగా మైండ్ పోవడం ఖాయం.ముఖ్యంగా ముఖేష్ అంబానీ కుటుంబానికి వంటలు చేసే చెఫ్ జీతం సంవత్సరానికి 24 లక్షలు అంటే నెలకు రెండు లక్షలు చెల్లిస్తున్నారు. ఈ చెఫ్ ని కేవలం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ భోజనం తయారీ కోసం అపాయింట్ చేశారు. చెఫ్ ఫ్యామిలీకి సంబంధించిన వసతి కూడా మొత్తం యాంటీయాలోనే ఉంటుంది. అలాగే వారి కుటుంబానికి కావలసిన సకల సదుపాయాలను కూడా ముకేశ్ అంబానీ కుటుంబమే భరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: