లాక్ డౌన్ కారణంగా పన్వెల్ ఫాంహౌజ్ లో తెరే బినా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పన్వెల్ ఫాంహౌజ్ లోనే చిత్ర యూనిట్ కాలం గడుపుతున్నారు. ఈ సినిమా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఇక్కడే ఉండి పోయారు ప్రస్తుతం ఇక్కడి నుండే సల్మాన్ మరియు జాక్వెలిన్ లు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలను పంచుకుంటున్నారు. మదర్స్ డే సందర్భంగా సల్మాన్ ఖాన్ విషెస్ తెలియజేస్తూ తెరే బినా టీజర్ ను విడుదల చేశాడు.
ఈ టీజర్ లో సల్మాన్ స్వయంగా పాడిన పాటను జోడించి టీజర్ ను విడుదల చేశారు. అదేవిధంగా జాక్వెలిన్ తో కండలవీరుడు రొమాన్స్ మనం చూడవచ్చు, ఈ పాటకు షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించారు మరియు అజయ్ భాటియా స్వరాలు సమకూర్చారు. పన్వెల్ ఫాం హౌజ్‌లోనే ఈ సాంగ్‌ని షూట్ చేశారు. పూర్తి సాంగ్ ని ఈ నెల 12 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు.