దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండట౦ లేదు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే తాజాగా ఏనుగులకు కూడా రాజస్థాన్ లో కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. వాటికి కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఈ కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. 

 

జైపూర్ హాతి గావ్ ( ఎలిఫెంట్ విలేజ్) లో  రాజస్థాన్ అటవీ శాఖ మూడు రోజుల పాటు కోవిడ్ పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తుంది. మొదటి రోజు 19 ఏనుగుల నమూనాలను తీసుకున్నారు. అక్కడ మొత్తం దాదాపు వంద ఏనుగుల వరకు కరోనా పరీక్షలను నిర్వహిస్తారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: