పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎప్పుడు ఏం  జరుగుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ కూడా కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్రం నిధులు ఇవ్వనుంది.

పునరావాసంతో సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో వెలుగులోకి కీలక అంశాలు వచ్చాయి. 2016 సెప్టెంబర్ నాటి కేంద్ర ఆర్ధిక శాఖ మెమో ప్రకారం పోలవరం నిర్మాణ నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కేవలం 20 శాతం పునరావాసం పూర్తి అయింది. దీనితో ఏపీ సర్కార్ షాక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: