భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు మ్యాచ్ లో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా టీం ఇండియా బ్యాటింగ్ కి దిగి తొలి సెషన్ లో పది ఓవర్ల పాటు దూకుడుగా ఆడినా సరే ఆ తర్వాత మాత్రం ఇబ్బంది పడింది. రెండో సెషన్ లో న్యూజిలాండ్ బౌలర్ లు వికెట్ లు తీయలేకపోయినా సరే సమర్ధవంతంగా పరుగులను అడ్డుకున్నారు.

సెషన్ మొత్తం మొత్తం మీద 60 పరుగులే రావడం గమనార్హం. ఇక టీ బ్రేక్ ఇచ్చే విషయంలో కాస్త ఆసక్తి చోటు చేసుకుంది. బ్యాడ్ లైట్ తో పాటుగా వర్షం వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో అంపైర్ లు టీ బ్రేక్ కి వెళ్ళాలి అంటూ 56 వ ఓవర్ మూడో బంతికి చెప్పడం షాక్ కి గురి చేసింది. వాస్తవానికి ఓవర్ పూర్తి అయిన తర్వాత చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: