నిన్నటి రోజున నష్టపోయిన భారత దేశీయ మార్కెట్లు నేడు మళ్లీ లాభాల బాట పడ్డాయి. నేడు దేశియ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలన్ని భారీ లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకుల షేర్ల కారణంగా కాస్త మార్కెట్లకు కొనుగోలు జోరందుకుంది. ఇక దీంతో ఇంట్రాడే సెన్సెక్స్ 393 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కూడా10149 పాయింట్ల వద్దకు పెరిగింది. ఇకపోతే చివరికి బీఎస్ఈ సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో 34247 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ కేవలం 69 పాయింట్లు లాభంతో 10116 పాయింట్ల వద్ద నేటి మార్కెట్ ను ముగింపు చేశాయి.

IHG

 


ఇకపోతే నేటి స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ 50 లో హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, శ్రీ సిమెంట్,  కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల బాట పట్టాయి. ఇక ఇందులో ఇండస్ ఇండ్ బ్యాంక్ 10 శాతం పైగా ర్యాలీ చేసి లాభాల్లో ముగిసింది. ఇక మరోవైపు గెయిల్ కోల్ ఇండియా, బజాజ్ ఆటో, టైటాన్, హీరో మోటార్ కాప్ షేర్లు నష్టాల బాట పడ్డాయి. ఇక ఇందులో హీరో మోటార్ కాప్ షేర్లు మూడు శాతానికి పైగా దారుణంగా నష్టపోయాయి. 


ఇక అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి మారకపు విలువ స్వల్పంగా లాభపడింది. కేవలం ఏడు పైసలు లాభంతో  75.52 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. ఇక చివరిగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురుల విషయానికి వస్తే ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇందులో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 1.6 శాతం నష్టపోయి 40.5 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే డబ్ల్యూటీఏ ముడి చమురు బ్యారెల్ 2.13 శాతం నష్టపోయి 38.1 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: