ప్రతిరోజు ఒకేలాంటి వంట కాకుండా ఈ రోజు కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి. ఏప్పుడు కూడా మనం అన్నమే కదా తినేది కాబట్టి ఈ రోజు అదే అన్నంతో సరికొత్తగా కిచిడి చూసేద్దామా..మేము చెప్పే విధంగా వండితే చాలా రుచికరంగా ఉంటుంది. మరి ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !

కావల్సిన పదార్థాలు:

బియ్యం  – 1cup

పెసరపప్పు – 1/2cup

బంగాళాదుంపలు  – 2

కాప్సికమ్ – 1

గ్రీన్ బఠానీలు – 1/4cup

పచ్చి మిర్చి 4

అల్లం -కొద్దిగా

నెయ్యి – 1 లేదా 2 tsp

ఇంగువ – 1-2 చిటికెడు

జీలకర్ర – 1/2tbsp

నల్ల మిరియాలు- కొద్దిగా

లవంగాలు – 4

పసుపు – 1/2 tsp

ఉప్పు – రుచి సరిపడా

కొత్తిమీర-కొద్దిగా

 తయారుచేయు విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యంతో పాటు పెసరపప్పును కూడా వేసి శుభ్రంగా కడిగి ఒక  అరగంట వరకు నీటిలో నానబెట్టుకొండి. ఒక గిన్నెలో వేరేగా బఠాణి కూడా నానపెట్టండి బియ్యం నానే లోపు పైన చెప్పిన కూరగాయలు, ఉల్లిపాయలు అన్నిటిని సన్నని ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో జీలకర్ర,  ఇంగువ వేసి వేయించుకోవాలి.ఆ తరువాత అందులోనే  ఒక 6 లేదా 7 మిరియాలు, లవంగాలు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు వేసి నెయ్యిలో వేయించాలి అవన్నీ వేగి మంచి వాసన వస్తున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, క్యాప్సికమ్, బఠాణీలు అన్ని వేసి కొద్ది సేపు వేపాలి. అన్ని మెత్తగా వేగిన తరువాత  నానపెట్టుకున్న బియ్యం, పెసరపప్పు సరిపడా ఉప్పు వేసి ఒకసారి గరిటెతో తిప్పండి. తర్వాత అందులో 3 కప్పుల నీటిని పోసి గిన్నెకి సరిపడా మూత పెట్టండి.మొత్తం రైస్ ఉడికిన తరువాత పైన మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే కిచిడి రేడి అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: