కరోనా వైరస్ కష్టకాలంలో వైద్యులు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయార అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే  ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు రక్షించడానికి సిద్ధమయ్యారు. ఇక ఎన్నో రోజుల నుంచి వైద్యులు దైవం లాంటివారు అని చెబుతున్న మాట ఇక ఇప్పుడు నిజం అయింది అని అనుకుంటున్నారు జనాలు. ఇక వైద్యులకు అమితమైన గౌరవం ఇస్తూ ఉన్నారు. అయితే కొంత మంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉన్నాయి.


 చికిత్స చేసి  ప్రాణం పోసే వైద్యులే కొన్ని కొన్ని సార్లు ఏకంగా నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయే పరిస్థితులను తీసుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలింతకు వైద్యురాలు ఆపరేషన్ చేసింది. కానీ వైద్యురాలు చేసిన పొరపాటు చివరికి బాలింత ప్రాణం మీదికి తీసుకువచ్చింది. భర్త తొందరగా అప్రమత్తం కావడంతో చివరికి ఆమె ప్రాణాలతో బయట పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆపరేషన్ చేస్తూ ఏకంగా ఆమె గ్లౌస్ పొట్టలోనే వదిలేసింది సదరు వైద్యురాలు. ఈ ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేతన్ భార్య కాంచన ప్రసవం కోసం గత ఏడాది అక్టోబర్ మూడవ తేదీన స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరింది.


 ఇక సదరు మహిళకు సిజేరియన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఆతర్వాత అందరిలాగానే సదరు మహిళను కూడా డిశ్చార్జ్ చేశారు. కానీ పదిహేను రోజుల తర్వాత కడుపు నొప్పి రావడం మొదలైంది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి సమస్య లేదు అంటూ కొన్ని మందులు రాసి ఇచ్చారు. మూడు నెలల తర్వాత కడుపు నొప్పి మరింత తీవ్రం అయింది.ఈ క్రమంలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అల్ట్రా స్కానింగ్ చేసిన వైద్యులు కాంచన పొట్ట లో ఏవేవో వస్తువులు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని చెప్పడంతో.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా బాధితురాలి నుంచి పొట్టలో నుంచి చేతికి తొడుక్కునే రెండు గౌస్ లను తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు భర్త చెబుతున్నారు. ఈ విషయం  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: