ఇటీవలి కాలంలో బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోతుంది అనే విషయం తెలిసిందే. క్షణకాల సుఖం కోసం చేయకూడని నీచమైన పనులు చేస్తూ ఉన్నారు మనుషులు. ఇలా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజం మొత్తం సిగ్గు పడే పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేటి రోజుల్లో ఎన్నో అక్రమ సంబంధాలు అటు ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు.. ఎన్నో దారుణమైన ఘటనలకు కారణమవుతున్నాయని చెప్పాలి. అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజుల్లో ఆత్మహత్యలు హత్యలు లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.. వయసుతో సంబంధం లేకుండా వరుసతో పనిలేకుండా క్షణకాల సుఖం పొందితే చాలు అనుకుంటూ నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 35 ఏళ్ల మహిళ పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ కూడా 15 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడింది. ఇక ఎన్నో రోజుల పాటు భర్త కి తెలియకుండా రహస్యంగా ప్రేమలో మునిగి తేలుతు వచ్చారు. కానీ ఓ రోజు అసభ్యకర రీతిలో 15 ఏళ్ల బాలుడి తో భార్య కనపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఇటీవల ఈ ఘటన బీహార్లోని జుమైరా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 అయితే ఫేస్బుక్ వేదికగా 35 ఏళ్ల మహిళకు 15 ఏళ్ల మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇక ఈ పరిచయం కాస్తా కొన్నాళ్ళకే అక్రమ సంబంధానికి తెరలేపింది. మొదట్లో చాటింగ్ చేసుకున్న ఇద్దరు ఆ తర్వాత నెంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తనను ఏకాంతంగా కలవాలి అంటూ 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న 15 ఏళ్ళ బాలుడిని పిలిచింది. అయితే భర్త ఇంట్లో లేని సమయం కావడంతో ఇక రాత్రంతా ఇద్దరూ కలిసే ఉన్నారు. ఉదయం అకస్మాత్తుగా భర్త ఇంటికి రావడంతో వారిద్దరిని అసభ్యకర రీతిలో చూశాడు. దీంతో బాలుడితో పాటు భార్యను కూడా చితకబాదాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: