కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యులు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అందరూ ఎవరి స్వార్థం కోసం వారు ఆలోచించుకుంటున్న తరుణంలో అటు వైద్యులు మాత్రం కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో గుడిలో ఉండే దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ తెల్లకోటు  వేసుకున్న వైద్యులు మాత్రం తప్పకుండా ప్రాణాలు పోస్తారు అని మాత్రం నమ్మడం మొదలుపెట్టారు అందరూ.


 ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరిలో కూడా వైద్యులు అంటే మరింత గౌరవం పెరిగిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా చికిత్స చేస్తూ ఎంతో మంది ప్రాణాల మీదకి తెస్తున్న  ఘటనలు వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా మారిపోతున్నాయి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయ్ అని చెప్పాలి. ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన నాలుగేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.


 ఓల్డ్ మలక్పేట ఎం సి హెచ్ కాలనీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణ, శ్వేతా దంపతులకు కుమారుడు అఖిల్ ఉన్నాడు. అయితే ఇటీవల శ్వాస సంబంధ సమస్య తోపాటు తీవ్రమైన జ్వరం జలుబు దగ్గు రావడంతో వెంటనే శ్రీకృష్ణ ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత బాలుడు మృతి చెందాడు. వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలోనే అదే రోజు రాత్రి శ్రీకృష్ణ ఆస్పత్రి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: