ఇటీవల కాలంలో రోజులు గడుస్తున్నా కొద్దీ అటు బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు అన్నది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు రక్తసంబంధాలకు కట్టుకున్న బంధాలకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు మనుషులు. కానీ ఇటీవల కాలంలో మాత్రం వీటన్నిటిని మరిచి చేయకూడని నిజమైన పనులను చేసేస్తూ ఉన్నారు. కొంతమంది ఏకంగా డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తూ ఉంటే.. ఇంకొంతమంది సుఖం కోసం చెడుదారుల్లో వెళ్తూ ఉన్నారు.


 ఇలా మనుషులు చేస్తున్న పనులు రోజు రోజుకీ బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా చేస్తున్నాయ్ అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ముఖ్యం గా పెళ్లయి పిల్లలు ఉన్నవారు.. ఇక కుటుంబం తో ఎంతో సంతోషం గా ఉండాల్సింది పోయి పరాయి వ్యక్తుల మోజులో మునిగి పోతూ చివరికి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. భర్తను కాదని ఫేస్ బుక్ లో  పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది.


 కానీ ఆ ఫేస్బుక్  ప్రేమే చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది అని చెప్పాలి. నిజాంబాద్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల ఉస్మా బేగం కు 18 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది. ఇద్దరూ  పిల్లలు కూడా ఉన్నారు. అయితే సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్న సమయంలో ఆమెకు ఫేస్ బుక్ లో  పరిచయమైన వ్యక్తితో ప్రేమ పుట్టింది. ఇక ఫేస్బుక్లో పరిచయమైనా షహజాద్ అనే యువకుడిని నమ్మి నిజాంబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్ళింది. అయితే కొద్ది రోజులపాటు ఆమెను లైంగికంగా వాడుకున్న యువకుడు దారుణం గా హత్య చేశాడు. తాను పని చేస్తున్న ఫ్యాక్టరీలోనే ఆమె మృత దేహాన్ని పడేసి వెళ్ళాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా ఈ నిజాలు బయట పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: