ఇటీవల కాలంలో మనిషి ప్రాణం ఎప్పుడు పోతుంది అన్నది చెప్పలేని విధంగా మారిపోయింది. ఎందుకంటే అంత ఆరోగ్యంగా ఉన్నారూ అనుకుంటున్న సమయంలో ఊహించిన విధంగా కొంతమందికి హార్ట్ ఎటాక్ వచ్చి కేవలం సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరి కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ముంచుకొస్తూ ఇక ఎంతో మందిని మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే గాజాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటుచేసుకుంది.


 ఓ అపార్ట్మెంట్లో కుటుంబం అంతా ఎంతో ఘనంగా బర్త్ డే వేడుకలను చేస్తుంది. ఈ క్రమంలోనే ఇలా పుట్టినరోజు వేడుకల సందడిలో ఉన్న సమయంలో క్షణాల వ్యవధిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదానికి కుటుంబం మొత్తం బలైపోయింది. ఏకంగా అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ఎగసి పడిన అగ్నికీలలకు 21 మంది బలైపోయారు. ఇందులో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం గమనార్హం. దీంతో ఆ ప్రాంతంలో అరణ్య రోదనలు మిన్నంటాయి అని చెప్పాలి. అయితే ఇటీవల శరణార్థుల   శిబిరం ప్రాంతంలో రాత్రి మూడు అంతస్తులు భవనంలోని పై అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.


 అయితే ఇంట్లో నిలువ చేసిన పెట్రోల్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉండడం గమనార్హం.  అయితే పెట్రోల్ కి ఎలా మంటలు అంటుకున్నాయి అన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నగానే మారిపోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా గాజా ప్రాంతం నిత్యం బాంబు మోతలతో  దద్దరిల్లిపోతుంది అన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లలో కూడా అత్యంత ఘోరమైన సంఘటన ఇదే అని అక్కడి అధికారులు చెబుతూ ఉండడం గమనార్హం. కాగా ఇక ఈ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పడానికి కూడా ఎవరూ మిగలలేదు అంటూ అధికారులు చెబుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: