ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది  పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడుసాటి మనుషులకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే  అయ్యో పాపం అంటూ జాలి చూపించిన మనిషి ఇక ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక సాటి మనుషుల విషయంలో మానవత్వాన్ని చూపించడం కాదు ఎంతో కరకశంగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్న ఘటనలే నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.


 ఇలా చిన్నచిన్న కారణాలకే విచక్షణ కోల్పోతున్న మనిషి ఏకంగా పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలి చూపించడం లేదు. వెరసి విచక్షణ కోల్పోయి దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి అందరిని అవక్కాయ్యేలా  చేసింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు తాముకు కావాల్సిన ఆహారాన్ని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇక ఇంటి ముంగిటికే తెప్పించుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కావడం జరుగుతూ ఉంటుంది.


 ఇక్కడ ఒక కస్టమర్ కి ఇలాగే ఆలస్యంగా ఫుడ్ డెలివరీ అయ్యింది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు కస్టమర్ ఏకంగా ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హుమాయూన్ నగర్ లో వెలుగు చూసింది. తన 15 మంది అనుచరులతో కలిసి వచ్చి ఒక హోటల్ వద్ద భయానక వాతావరణాన్ని సృష్టించాడు కస్టమర్. దీంతో భయంతో సదరు ఫుడ్ డెలివరీ బై హోటల్లోకి పరుగులు తీయగా..  హోటల్లోకి దూసుకెళ్లి మరి బాధితులపై దాడి చేశారు. ఏకంగా మరిగే నూనె మీద పడటంతో ఫుడ్ డెలివరీ బాయ్ తో పాటు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: