
ఇక ఇటీవల కాలంలో ఏకంగా కట్టుకున్న వారిపై అనుమానాన్ని పెంచుకొని కొంతమంది దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు కూడా వెలుపలోకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. భార్య పోర్న్ వీడియోలు చూస్తుంది అని అనుమానంతో దారుణంగా గొంతు నులిమి చంపేశాడు భర్త. ఇక ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. హల్తానికి చెందిన యునస్, సీమా ఇద్దరికీ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఛానల్ గేట్ ఇందిరా నగర్ ప్రాంతంలో వీరు అద్దెకి ఉంటున్నారు.
కొన్నాళ్లపాటు వీరి దాంపత్య బంధం సజావుగాని సాగింది. కానీ కొన్నాళ్ళుగా యూనస్ మొదటి భార్యతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. దీంతో వీరి బంధంలో మనస్పర్ధలు వచ్చాయి. వీరిద్దరి మధ్య రోజు గొడవ జరిగేది. ఇంతలో సీమకు జకీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక తర్వాత సీమ రోజు మొబైల్ లో బిజీ బిజీగా ఉండేది. దీంతో భర్త యునస్ కు అనుమానం వచ్చింది. ఇక ఓ రోజు భార్య ఫోన్ చెక్ చేస్తే జకీర్ ఏకంగా పోర్న్ వీడియోలు తన భార్య సీమకు పంపినట్లు గుర్తించాడు. దీంతో కోపంలో విచక్షణ కోల్పోయిన యునస్ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఇక ఇటీవలే అతని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.