భారత్లో క్రికెట్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకఎన్నో రకాల క్రీడలు భారత్ లో ఉన్నప్పటికీ క్రికెట్ నే అందరూ తెగ ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. బ్యాట్ కి బంతికి మధ్య జరిగే సమయాన్ని చూసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక భారత్లో క్రికెట్ కి రోజు రోజుకు క్రేజ్ అంతకు అంతకు పెరిగిపోతుంది తప్ప.. ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో ఎంతోమంది యువకులు కూడా క్రికెట్ ను ప్యాషన్ గా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.



 ఇకపోతే ఇలా క్రికెట్ కి ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలు జరుగుతున్న ప్రతిసారి కూడా ఇక బెట్టింగ్కు పాల్పడుతూ ఉండటం చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బెట్టింగ్ ముఠాల ఆటలు కట్టించినప్పటికీ ఎంతో మంది సామాన్యులు సైతం ఇలా క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్ పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి.



 అయితే క్రికెట్ మ్యాచ్ లో బెట్టింగులు పెట్టడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించడం లేదా లక్షలు పోగొట్టుకోవడం గురించి ఇప్పటివరకు విన్నాము. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బెట్టింగ్ పెట్టడం ద్వారా 100 కోట్ల రూపాయలు కోల్పోయాడు. ఏకంగా 12 ఏళ్లలో ఒక వ్యక్తి ఇలా క్రికెట్లో బెట్టింగ్ పెట్టి 100 కోట్ల పైగా పోగొట్టుకున్నాడు. ఇకపోతే ఇటీవల హైదరాబాద్ లో బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తుండగా.. అశోక్ రెడ్డి అనే వ్యక్తి తన అనుభవాలను వెల్లడించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. వనస్థలిపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అతను సరదాగా బెట్టింగులు వేసేవాడు. క్రమక్రమంగా బెట్టింగ్ వేయడం వ్యసనంగా మారింది. దీంతో సంపాదించిన మొత్తాన్ని బెట్టింగ్ లో పెట్టడమే కాదు అప్పు తీసుకొని మరి బెట్టింగ్ కాసేవాడు చివరికి మొత్తం నష్టపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: