పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ పెరుగుతుంది. అక్కడ ఆర్థిక మంత్రి ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. ఇప్పుడు అక్కడ తినడానికి తిండి లేక, తినడానికి ఏదైనా కొందామన్నా వీలు లేక జనాలు రోడ్ల మీద పడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైనా కొందామన్నా సరుకుల కొరత అక్కడ గట్టిగా ఉంది. లాహోర్ లో గోధుమపిండి దొరకక పోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు.


విదేశీ నిల్వలు తగ్గిపోవడం, నిత్యాసరధరలు ఆకాశాన్ని అంటడంతో.. పంచదార, నూనె, నెయ్యి లాంటి నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. 15 కేజీల గోధుమపిండి బస్తా ఖరీదు 2,050రూపాయలు ఉందక్కడ. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి లాంటి వస్తువుల ధరలు 25శాతం నుంచి 62శాతం కు పెరిగాయి. నిత్యవసరాలపై సబ్సిడీ కూడా ఎత్తేయడంతో ప్రజలకు ధరల సమస్య ఎక్కువైంది. ద్రవ్యోల్బణ రేటు వారానికి 1.0శాతం పెరుగుతుంది.


పాకిస్తాన్ లో ఉపయోగించే వంటనూనె 90%దిగుమతుల ద్వారా లభిస్తుంది. విదేశీ నిలువలు తక్కువగా కేవలం 3వారాలకు సరిపడానే  ఉండడంతో,వంటనూనెను అత్యవసర జాబితాలో నుంచి తొలగించారు. అంతేకాకుండా మార్చ్ లో రంజాన్ మాసం ప్రారంభమవుతుండడంతో నెయ్యి ఇంకా నూనెల దారులు క్రమబద్ధీకరించాలని అక్కడ డిమాండ్ ఎక్కువవుతుంది. పాకిస్తాన్ లో రూపాయి విలువ కూడా క్రమంగా క్షీణించి పోయింది. డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ 227 రూపాయలకు పడిపోయింది.


విదేశీ మారక ద్రవ్యం నిలువలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై 8 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2016లో ప్రభుత్వాన్ని మాకు అప్పగించినప్పుడు విదేశీ  మారకద్రవ్య నిలువలు 2,400 బిలియన్ డాలర్లు ఉండేవి. అవి కూడా ఇప్పుడు మా దగ్గర లేవని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మూడు శాతం కన్నా తక్కువ  ఉందని పాకిస్తాన్ మరొక శ్రీలంక కాబోతుందని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: