
రాజ్యాంగ ఫలాలు దక్కని వారిలో అనాథలే ముందు వరుసలో ఉన్నారన్న మంద కృష్ణ మాదిగ అనాథలకు కనీసం గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అనాథలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు దక్కడం లేదని మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనాథలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంద కృష్ణ మాదిగ కోరారు. కులం, మతం తెలియని వారి పక్షాన అనాథల హరి గోస పేరుతో ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద మహా దీక్ష చేస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు అనాథలకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
అనాథలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తమ మహా దీక్షను సైతం కేసీఆర్ పట్టించుకోకపోతే.. పౌర సమాజాన్ని ఏకం చేసి పోరాడుతామని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. మంద కృష్ణ మాదిగ గతంలోనూ అనేక ఉద్యమాలు చేశారు. అయితే ఆయనలో గతంలో ఉన్న ఆవేశం, ఊపు కనిపించడం లేదు. మరి ఈ సమయంలో మంద కృష్ణ మాదిగ ఉద్యమాలు నడిపించగలరా.. ఫలితాలు సాధించగలరా అన్నది చూడాలి.