పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టేటువంటి చైనాకు పాకిస్తాన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇంతకూ అది ఏంటంటే మీ భద్రతను మేము చూడలేము, మీరే మీ భద్రతకు ప్రైవేటు ఏజెన్సీ ని పెట్టుకోండి అని చెప్పేసింది పాకిస్తాన్. ఒకరకంగా ఇది ఒక దేశం తమ దేశ రక్షణలో ఉన్న మరొక దేశానికి ప్రైవేట్  సెక్యూరిటీని పెట్టుకోమనడమే.  ప్రైవేట్  సెక్యూరిటీని పెట్టుకోమనడం అంటే ఒక రకంగా ఈ దేశంలో ఉన్న పౌరులని అవతల ఉన్న సెక్యూరిటీ చంపేయడమే. అంటే ఒకరకంగా వారి పౌరుల్ని చంపడానికి ఆ దేశమే హక్కు ఇవ్వడం అన మాట.


ఇదే బుర్ర లేని పాకిస్తాన్ చేసిన పిచ్చి పనిగా చెప్పుకోవచ్చు. తన దేశం మీద సార్వభౌమాధికారాన్ని పక్క దేశానికి ఇచ్చేసింది. దానికి కారణం లేకపోలేదు, అదేంటంటే ఈమధ్య చైనా కి సంబంధించిన సంస్థలు పాకిస్తాన్ లో వివిధ చోట్ల  పని చేసుకుంటూ ఉంటుంటే, చైనా వాళ్లు ఏం చేస్తున్నారంటే.. చైనా వాళ్లతోనే పని చేయించుకుంటున్నారు కానీ, పాకిస్తాన్ వాళ్లకి పని ఇవ్వరు. దాంతో అక్కడ జనాలు విసుగు చెంది ఉన్నారు.


ఇక్కడ ఉన్న నిధులను, వనరులను దోచుకుపోతున్నారు కానీ, ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు అంటున్న స్థానిక ప్రజలకు మద్దతుగా పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులు కావచ్చు, లేదా సింధు రెబల్స్, లేదా తెహరిన్ కి తాలిబాన్ ఈ పాకిస్తాన్ లాంటివాళ్ళు అవ్వొచ్చు. వారు ఆ ప్రజలకు మద్దతుగా ఎటాక్‌ చేస్తున్నారు. దీంతో వాళ్లకు రక్షణ వహించే బాధ్యత పాకిస్తాన్ వాళ్ళు వహించాల్సి వస్తుంది. దీంతో రక్షణ వహిస్తున్న పాకిస్తాన్ వాళ్ళని కూడా ఆ మద్దతుదారులు చంపేస్తున్నారు.


దేశంలో ఉగ్రవాద సంఘటనలు పెరిగిన తర్వాత పాకిస్థాన్ పంజాబ్ పోలీసు శాఖ ప్రావిన్స్‌లోని చైనా పౌరులను తమ రక్షణ కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఫోరమ్‌లను నియమించుకోవాలని  కోరింది. ఇదంతా చూసి కంగు తిన్న చైనా వాళ్ళు పాకిస్తాన్  ఇచ్చిన సలహాకు ఎలా స్పందిస్తారో ఇక వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: