జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటారు. కానీ పెద్ద స్థాయికి వెళ్ళడం అంటే ఆషా మాషీ కాదు. చిన్నప్పటి నుండి కష్టపడి చదవాలి. ఈ ప్రపంచంలో ఏది సాధించాలి అన్నా ఒక్క చదువుతోనే సాధ్యం. అందుకే పిల్లల తల్లితండ్రులు కూడా చదువు ప్రాముఖ్యత గురించి వారికి తెలియచేస్తూ ఉండాలి. అయితే పిల్లలు అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు పిల్లలు ఒకసారి చదివితే చాలు అలాగే గుర్తుండిపోతుంది. కానీ మరి కొందరు పిల్లలకు చదివిన కాసేపు వరకు మాత్రమే పాఠాలు గుర్తుంటాయి. ఈ అలవాటు చిన్న పిల్లల నుండి డిగ్రీ లు పొందే పెద్దల వరకు ఉంటుంది.

అయితే ఈ సమస్య వలన పరీక్షలు సరిగా రాయలేరు. తద్వారా కొన్ని సార్లు ఫెయిల్ అవ్వొచ్చు లేదా ర్యాంక్ లు తక్కువగా రావొచ్చు. అయితే ఇలా జరగకుండా చదివిన పాఠాలు నేర్చుకునేలా, నేర్చుకున్నవి పరీక్షలో గుర్తు ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలి అని ప్రముఖులు చెబుతున్నారు.

మరి అవేమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* మీరు చదివే ఏ అంశాన్ని అయినా బట్టీ పట్టడం మానేయండి. ఇలా చేయడం వలన మీరు ఏది చదివినా అప్పటికి నేర్చుకున్నట్టే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మరిచిపోతారు. దీని వలన మీకు చాలా నష్టం.

* అలా కాకుండా మీరు చదివే పాఠాలను బట్టి కొన్ని షార్ట్ కట్ లను పెట్టుకుని చదివితే చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.

* మరియు మీరు చదివిన పాఠాలను అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే ఏమైనా మరిచిపోతే మళ్ళీ రిమైండ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది.

* మీరు ఏదైనా సబ్జెక్టు లో ఒక పాఠం చదివేటపుడు అది కష్టగా ఉంటే ఇంకో పాఠానికి వెళ్లడం మంచిది.

* ఏకధాటిగా చదవకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న విరామం తీసుంటూ ఉండాలి. అప్పుడే బ్రెయిన్ స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది.

ఇలా పైన చెప్పిన విషయాలన్నీ పాటిస్తే ఇబ్బంది లేకుండా చదివిన విషయాలు గుర్తుండి పరీక్షల్లో బాగా రాసి భవిష్యతులో మంచి స్థాయిలో స్థిరపడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: