చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరుకుంటారు. అయితే మంచి నాణ్యత విద్య సాధారణంగా చాలా ఖరీదైనది. దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు తమ విద్యను కోల్పోతున్నారు.ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పై చదువులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. భారతదేశంలో ఇప్పుడు ఏదైనా పెద్ద కోర్సులు, డిగ్రీ చదువుల కోసం విద్యా రుణాలను అందిస్తున్నాయి. విదేశాల్లో చదువులకు కూడా ఎడ్యూకేషన్ లోన్లు ఇస్తున్నాయి. ట్యూషన్, వసతి, దుస్తులు, లైబ్రరీలు అండ్ ప్రయోగశాలల ఫీజులు, పుస్తకాలు మరెన్నో.. వీటితో పాటే కోర్సు-సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి విద్యా రుణాలు తరచుగా ఉపయోగించబడతాయి. అతి తక్కువ వడ్డీ రేట్లకు విద్యా రుణం ఇస్తున్న బ్యాంకుల లిస్ట్ ను ఇక్కడ తెలుసుకుందాం.విద్యార్థి రుణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు 8.35శాతం అందిస్తోంది. దీని నెలవారీ చెల్లింపు వాయిదా రూ. 31,522గా ఉంటుంది.కెనరా బ్యాంక్ నుండి రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ ఏడు సంవత్సరాల తిరిగి చెల్లించే వ్యవధితో 8.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దాని లోన్ మొత్తం EMI రూ. 31,472 గా ఉంటుంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు సంవత్సరాల కాలవ్యవధికి రూ. 20 లక్షల విద్యా రుణంపై 7.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా EMI రూ. 31,073గా ఉంటుంది.


ఇండియన్ బ్యాంక్ రూ. 20 లక్షల ఏడు సంవత్సరాల రుణంపై 7.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దీని EMI రూ. 31,073గా ఉంటుంది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 7.45 శాతం వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని అందిస్తోంది. రూ. 20 లక్షల రుణానికి మొత్తం EMI రూ. 30,627 ప్రతినెల చెల్లించాలి.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.95 శాతం తక్కువ వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని ఇస్తోంది. 7 సంవత్సరాలకు రూ. 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇస్తోంది. ఇది సమానమైన నెలవారీ వాయిదాలో తిరిగి చెల్లించవచ్చు. వీటికి నెలకు రూ.30,136 చెల్లించాల్సి ఉంటుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు 7.50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంది. ఇది సాధారణం కంటే కొంచెం ఎక్కువ. ఈ లోన్ EMI రూ. 30,677గా ఉంటుంది. అంతే కాకుండా.. ఇదే వడ్డీ రేటుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , IDBI బ్యాంక్ కూడా అదే వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని అందిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: