దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
ఇండోర్ మరో కొత్త కోర్సును ప్రారంభించింది.వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా లీడర్‌షిప్ స్టడీస్‌లో సర్టిఫికేషన్ కోర్సును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. VUCA (వల్నరబిలిటీ, అన్‌సర్టెనిటీ, కాంప్లెక్సిటీ, యాంబిగిటీ) విభాగంలో పబ్లిక్ అండ్
కార్పొరేట్ లీడర్‌షిప్‌పై అందిస్తున్న ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. VUCA సెక్టార్‌లోని లీడ్ పొజిషన్స్ కోసం ప్రొఫెషనల్స్, పబ్లిక్ లీడర్స్‌కు అవసరమైన అప్‌స్కిల్స్‌ను మెరుగుపర్చడం ఈ కోర్సు లక్ష్యమని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఈ సర్టిఫికేషన్ కోర్సును డెలివరీ చేయడానికి ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ జారో ఎడ్యుకేషన్‌తో ఐఐఎం
ఇండోర్ ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన ఐఐఎం ఇండోర్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పారు జారో ఎడ్యుకేషన్ సీఈవో రంజితా రామన్.ఈ
కార్పొరేట్ అండ్ పబ్లిక్ లీడర్‌షిప్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు మూడు రోజుల పాటు క్యాంపస్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది. డైరెక్ట్-టు-డివైస్ (D2D) మోడ్ ద్వారా స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ జారో ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫారమ్‌తో 75+ గంటలపైగా లెర్నింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. IIM ఇండోర్ ఫ్యాకల్టీ పాఠాలు బోధించనున్నారు.
ఈ ఎనిమిది నెలల సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో లెక్చర్స్, కేస్ డిస్కషన్స్, ప్రాజెక్ట్ వర్క్, టర్మ్ పేపర్స్, అసైన్‌మెంట్స్ వంటివి ఉంటాయి.సైకాలజీ, పొలిటికల్ సోషియాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి విభిన్న సోషల్ సైన్స్ విభాగాల ద్వారా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు. గతం, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడానికి ఈ కోర్సు లీడర్స్‌కు బాగా ఉపయోగపడనుంది. పొలిటికల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో సమర్థవంతమైన టూల్స్, ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడంలోనూ ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ పూర్తి చేసిన ప్రొఫెషనల్స్.. పొలిటికల్ రిస్క్ అంచనా వేయడం, బ్లైండ్ స్పాట్‌లను గుర్తించడం, సంక్షోభం నుంచి కోలుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం.. వంటి విషయాలపై పూర్తి అవగాహన సాధించగలరు. ఈ కోర్స్ విద్యార్థులకు భవిష్యత్తులో ఆర్ధిక పరంగా చాలా బాగుంటుంది. బాగా సంపాదన అనేది ఉంటుంది. ఇక మరిన్ని వివరాల కోసం ఐఐఎం
ఇండోర్ వెబ్‌సైట్ నుంచి పూర్తి సమాచారం పొందవచ్చు.కాబట్టి ఆసక్తి వున్నవారు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చెయ్యండి.