వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచో ఆపై ఏడాది నుంచో పాద‌యాత్ర‌కు మ‌ళ్లీ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ఆయ‌న అనుకూల మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది. ఎన్నిక‌లు అయ్యి ఏపీలో ఇప్ప‌టికే యేడాది పూర్త‌వుతోంది. మ‌రో రెండేళ్ల త‌ర్వాత అంటే మొత్తం కూట‌మి ప్ర‌భుత్వం మూడేళ్ల పాల‌న పూర్త‌యిన వెంట‌నే జ‌గ‌న్ మ‌ళ్లీ పాద‌యాత్ర‌కు రెడీ అవుతార‌న్న మాట‌. అంటే జ‌గ‌న్ చివ‌రి రెండేళ్లే పాద‌యాత్ర తో జ‌నాల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తానంటే కొన్ని డౌట్లు ఇప్పుడు అంద‌రి లోనూ క‌లుగుతున్నాయి.  2019 ఎన్నిక‌ల కు ముందు జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. అప్పుడంటే.. ఆయ‌న అధికారంలోకి రాలేదు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఆయ‌న పాల‌న ఎలా ఉం టుందో ? కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు. పైగా యువ ర‌క్తం పొంగిపొర్లుతున్న నాయ‌కుడు .. వైఎస్సార్ కుమారుడు కావ‌డంతో ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని చాలా మంది క‌ల‌లు క‌న్నారు.


అయితే ఐదేళ్లు పాల‌న చేసిన త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ పాద‌యాత్ర‌కు వ‌స్తే జ‌నాలు ఏ ర‌కంగా అర్థం చేసుకుంటార‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. అస‌లు స‌మ‌స్య‌లే తెలియ‌వు అన్న చోట స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేయ‌డం త‌ప్పు కాదు ... ఇదే నారా లోకేష్‌కు క‌లిసి వ‌చ్చింది. గ‌తంలో ఆయ‌న తండ్రి చంద్ర‌బాబు రాష్ట్రాన్ని పాల‌న చేసినా లోకేష్‌కు పాద‌యాత్ర కొత్త కాబ‌ట్టి.. ఆయ‌న పాద‌యాత్ర బాగానే క‌లిసి వ‌చ్చింది. కానీ జ‌గ‌న్ గ‌తంలో ఐదేళ్లు పాల‌న సాగించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబ‌ట్టి.. ఆయన పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు మళ్లీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లినా అవే స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. అవే ఇబ్బందులు క‌లుగుతాయి. పైగా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై జ‌గ‌న్‌ను నిల‌దీసే అవ‌కాశం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాక‌పోవ‌డం లాంటివి మైన‌స్‌. ఏదేమైనా ఈ సారి జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తే ప్ర‌జ‌ల నుంచే చాలా ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వ్వ‌డం ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: