- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరుగుతుందా ? ఆయనకు కేంద్రంలో పెద్దలు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారా ? అంటే అవునని అంటున్నారు పరిశీల‌కులు. జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఆయన ఇటు తెలుగు ప్రజలకు అటు కేంద్రంలో పెద్దలకు బాగా దగ్గరయ్యారు. ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులు దగ్గర పవన్ కళ్యాణ్ కు మంచి మార్కులు ఉన్నాయి. ఇప్పుడు మరింతగా ఆయన ఇమేజ్ పెరగడానికి కారణం నిబద్ధతే అని తెలుస్తోంది. తాజాగా ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రితో ప్రధాని భేటీ అయ్యారు. ఈ క్రమంలో అందరూ ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు. సహజంగా పవన్ కూడా ఇదే చేస్తారని అందరూ అనుకుంటారు. అచ్చంగా ఇదే జరిగింది. అయితే దీనికి మించి రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు . . . రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం వంటి వాటిని పవన వివరించారు.


ఈ క్రమంలో రు . 555 కోట్లతో గ్రామీణ సడక్ యోజన ముందుకు తీసుకు వెళుతున్నామని పవన్ చెప్పుకు వచ్చారు. ఈ క్రెడిట్ అంతా ప్రధాని , సీఎం ల దేన‌ని అందరి ముందు చెప్పుకొచ్చారు. సహజంగా ఇలాంటి జరిగినప్పుడు విని ఊరుకోవటం రెండు చప్పట్లు కొట్టి అభినందించడం వరకు చేస్తారు. తర్వాత విందు సందర్భంగా మాట్లాడిన ప్రధాని పవన్ కు చాలా మంచి భవిష్యత్తు ఉంది ... దేశానికే ఆయన నాయకుడు కాగల శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి ... ఆయనను నిశితంగా గమనిస్తున్న చాలా భవిష్యత్తు ఉంది అని మోడీ ప్రశంసంచటం మాత్రమే కాదు . .  భుజం తట్టి మరీ ప్రస్తావించడం గమనార్హం. రాజకీయాలలో ఒకరిని ఒకరు పొగుడు కోవడం ఉంటుంది. సనాతన ధర్మం ఒక్కటే పవన్ మోడీకి దగ్గర చేయలేదు ఆయన అనుసరిస్తున్న విధానాలు .. గిరిజనులు గ్రామాలు అంటూ చేపడుతున్న కార్యక్రమాలు ఇవ‌న్నీ కూడా మోడీకి పవన్ ను చెరువు చేస్తున్నాయి. ఇదే ఆయన ఇమేజ్ను మరోసారి పైపైకి పెంచేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: