దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. నిరుద్యోగులుగా మారారు. వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు కూడా పలు నోటిఫికెషన్స్ ని వేస్తుంది. తాజాగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 114 పోస్టుల భర్తీ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇక ఈ నోటిఫికేషన్ లో కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అయితే దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 11 చివరి తేదీ అని తెలిపారు. ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 114 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో కన్సల్టెంట్ (జనరల్ మెడిసిన్)- 2, కన్సల్టెంట్ (పల్మనాలజిస్ట్)- 2, కన్సల్టెంట్ (క్రిటికల్ కేర్)- 4, సీనియర్ రెసిడెంట్ (బ్రాడ్ స్పెషాలిటీస్)- 46, జూనియర్ రెసిడెంట్ (బ్రాడ్ స్పెషాలిటీస్)- 60 పోస్టులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అంతేకాదు ఈ నోటిఫికేషన్ కి సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చునని అధికారులు తెలిపారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారికి మూడేళ్ల అనుభవం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పాసైనవారికి 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి అని తెలిపారు. ఈ పోస్టులకు అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించనుంది ఈఎస్ఐసీ. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలని తెలిపారు. అంతేకాదు దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఈఎస్ఐ అభ్యర్థులకు ఫీజు లేదని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: