ఒత్తిడి.. ప్రతి ఒక్కరికి ఉండేది. అసలు డబ్బు లేని వాడికి ఒత్తిడి ఉంటుంది.. అన్ని ఉన్నవాడికి ఒత్తిడి ఉంటుంది. ఇంకా ఉద్యోగాలు చేసే వారికీ అయితే ఈ ఒత్తిడి మరి ఎక్కువగా ఉంటుంది. నగరాల్లో నివసించే వారికీ మానసికంగా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కొందరికి ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటె మరికొందరికి కుటుంబానికి సంబంధించి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రాయితీ ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే డిప్రెషన్ తదితర సమస్యలు భారీగా వస్తాయి. అయితే ఈ పరిస్థితిని అదిగమించి జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటే ఈ చిట్కాలను పాటించండి. ఒత్తిడికి దూరంగా ఆనందంగా ఉండండి.  


బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు 10 నిమిషాల పాటు గట్టిగా గాలి పీల్చి, వదులుతూ ఉంటె కొంత ఒత్తిడి భారం తగ్గుతుంది. ప్రశాంత వాతావరణంలో రోజూ సూర్యోదయ సమయాన ఇలా చేయగలిగితే ఒత్తిడి దాదాపుగా తగ్గిపోతుంది. 


రోజూ ఉదయం కనీసం 40 నిమిషాల పాటు నడక, జాగింగ్, సైక్లింగ్, జిమ్, పరుగు వంటి వ్యాయామాలు చేస్తే ఎంతటి మానసిక ఒత్తిడినైనా సరే అధిగమించగలుగుతారు. 


సంగీతం, డ్యాన్స్, బొమ్మలు వేయటం, కొత్త ప్రదేశాలు తిరగటం, మొక్కలు, పెంపుడు జంతువుల పెంపకం, నచ్చిన పుస్తకాలు చదువుకోవటం వంటివి చేసిన మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. 


మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలంటే వేపుళ్ళు, జంక్ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, పండ్ల రసాలు, సలాడ్‌లు తీసుకోవటం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. 


ఒత్తిడి బాధితులకు కంటిమీద కునుకు ఉండదు. అయితే ఒత్తిడి తగ్గాలంటే రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. 


ఒత్తిడితో కూడిన బాధ్యతలు నిర్వహించేవారు వారానికి ఒకసారైనా మసాజ్ చేయించుకుంటే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: