సాధారణంగా ఈ రోజుల్లో చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరు మానసిక ఒత్తిడి అనే సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ మానసిక ఒత్తిడి వల్ల కంటికి సరిగా నిద్ర ఉండదు, సమయానికి ఆహారం తినలేము, వీటివల్ల మానసిక రుగ్మతల బారిన పడతాము. మెదడులో రేగే అలజడితో శారీరక సమస్యలకు దారి తీస్తుంది. ఈ ఒత్తిడి వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ కోవలోనే జీర్ణ వ్యవస్థ పైన ఈ ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఈ ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 మన శరీరంలో హానికక బ్యాక్టీరియాతోపాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. పేగుల్లో ఉండే ‘గట్‌’ బ్యాక్టీరియా జీవ క్రియ సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారం జీర్ణం కావడానికి జీర్ణ వ్యవస్థతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ సమన్వయంతో పని చేస్తాయి. అంటే మన మెదడుకు, జీర్ణ వ్యవస్థకు కనెక్షన్ ఉందన్నమాట. అందుకే మనం డిప్రెషన్ కి గురైతే ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ పైనా పడుతుంది. అంటే మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పలు ఇబ్బందులు తలెత్తుతాయన్న మాట. మరో విషయం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఉండే నాడీ వ్యవస్థను ‘రెండవ మెదడు’ అని కూడా వ్యవహరించడం గమనార్హం.మనం ఆందోళనకు గురైనా, ఆవేశ పడినా లేదా నిరాశలో మునిగిపోయినా ఆ ప్రభావం గట్ బ్యాక్టీరియా పైన కూడా పడుతుందట. ఫలితంగా దాని పని తీరులో మార్పులు సంభవించి జీర్ణ సంబంధ సమస్యలు మొదలవుతాయి.


అలాగే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి కూడా చాలా మందిలో కనిపిస్తాయి. దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడితో బాధ పడేవారిలో మల బద్ధకం, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్, అతిసార వ్యాధి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.మానసిక ఒత్తిడి ప్రారంభమమైన తొలి రోజుల్లో నాఢీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది. ఈక్రమంలోనే జీర్ణ వ్యవస్థపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు.. కొంత మంది పరీక్షకో లేదా ఇంటర్వ్యూకి హాజరయ్యే కొన్ని గంటల ముందు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవతుంటారు. ఫలితంగా కడుపులో తిప్పినట్టు అనిపించడం, మాటి మాటికీ మల విసర్జనకు వెళ్లాల్సి రావడం, వికారంగా అనిపించడం, వామ్టింగ్ సెన్సేషన్ వంటివి జరుగుతుంటాయి. అంటే పరీక్ష లేదా ఇంటర్వ్యూ టెన్షన్ వల్ల మెదడుపై ఒత్తడి పడి  ఆ ప్రభావం నేరుగా జీర్ణ వ్యవస్థపైన చూపిస్తున్నట్టే కదా.



మానసిక ఒత్తిడి కొన్ని సార్లు జీర్ణ క్రీయ నెమ్మదిగా జరిగేలా ప్రభావం చూపిస్తుంది. మరి కొన్ని సార్లు త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇటువంటి సమయంలో పొత్తి కడుపు నొప్పి, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాగే.. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కొంత మందిలో నొప్పిని తట్టుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందట.తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే ఆ ప్రభావం మనం తినే తిండిపైనా పడుతుంది. కొన్ని సార్లు ఎక్కువగా తినేస్తుంటాం. మరి కొన్ని సార్లు అసలు ఆకలే అనిపించదు. అలాగే వేళాపాళ లేకుండానూ తింటుంటాం. ఇటువంటి కారణాల వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తిని జీర్ణ క్రియలో మార్పులు కనిపిస్తాయి. ఫలితంగా వికారం, వాంతులు, కడుపులో నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. కొంత మందికి ఛాతీలో నొప్పి కూడా వస్తుంటుంది. దీనినే హార్ట్ ఎటాక్ అని పొరబడి మరింత ఒత్తిడికి గురవుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: