మనిషికి సాధారణంగా రక రకాల అనారోగ్యాలు రావడం సహజం.. ముఖ్యంగా కడుపు నొప్పి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముదిసలి వరకు వస్తుంది..అయితే దీనికి రక రకాల కారణాలు ఉంటాయి.. అధికంగా తినడం వల్లోనో..పాయిజన ఫుడ్ తినడం వల్లనో, తిన్న తిండి సరైన సమయానికి జీర్ణం కాకపోవడం వల్లనో వస్తుంది. కడుపునొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావటంగా చెబుతారు అజీర్తి ... వాటి గురించి తెలుసుకొనే ముందు కడుపు నొప్పికి కొన్ని లక్షణాలు బహిర్గతం అవుతాయి.  

కడుపు నొప్పిని నయం చేసే ఉత్తమ చిట్కాలు.


వాము నేతిలో వేయించి ఉప్పు కలుపుకుని మొదటి రెండు ముద్దలు అన్నం తింటే నొప్పి తగ్గిపోతుంది.

శొంఠి, ఉప్పు, మిరియాలు, వాము సమ భాగములుగా చేర్చి 5 గ్రాములు పరగడుపున నమిలి తిని కొంచం నిళ్ళు త్రాగితే కడుపు నెప్పి తగ్గుతుంది.

శొంఠి చూర్ణం 5 గ్రాములు, తగుమాత్రం చక్కెర కలిపి వేడి నీళ్ళతో తీసుకుంటే అజీర్ణం వల్ల వచ్చే కడుపునెప్పి, కడుపు వుబ్బరం తగ్గిపోతుంది.

పాల పండ్ల వల్ల వచ్చే అజీర్తికి, మజ్జిగ తాగితే పోతుంది.

పచ్చి పుదీనా ఆకులు ఏడు, ఏలక కాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టీ కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగిన తరువాత కొద్ది కొద్దిగా మంచినీళ్ళు తాగితే, ఆ మరుక్షణమే కడుపు నొప్పి కనుమరుగైపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: