వ్యాయామాలను సీరియస్ గా తీసుకునే రోజుల్లో మనం జీవిస్తున్నాము కాబట్టి అందుకు తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అయితే కొంతమంది జిమ్ సెంటర్లకు వెళ్లి కష్టపడి వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేసేస్తూ ఉంటారు. కానీ వ్యాయామానికి వెళ్లేముందు ఏం తినకుండా పరగడుపున వెళ్లి అక్కడ వ్యాయామాలు చాలా సీరియస్ గా చేస్తూ ఉంటారు.. కొంతమంది వ్యాయామానికి ముందు ఏమి తినకూడదు అనే అపోహలో ఉంటారు.. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు.. అలాగని కడుపునిండా తినాల్సిన అవసరం కూడా లేదు.. తేలికపాటి ఆహారాన్ని వ్యాయామానికి ముందు కేవలం కొద్ది పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినట్లయితే వ్యక్తి యొక్క దృష్టి వ్యాయామం నుంచి పక్కకు మరలే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రధాన వనరు కాబట్టి కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇలా వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శక్తి లభించడంతో పాటు ఆకలిని కూడా నివారించవచ్చు. ఇకపోతే ఎలాంటి ఆహారాలను వ్యాయామానికి ముందు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


1. ఓట్స్:
వ్యాయామానికి ముందు ఒక చక్కటి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. తేలికపాటి ఆహారం కాబట్టి త్వరగా జీర్ణం అయి మీరు వ్యాయామం చేసేటప్పుడు శక్తి మీకు లభిస్తుంది. ఇక ఓట్స్ తినేటప్పుడు కొన్ని పండ్ల ను కూడా జోడించవచ్చు.

2. ప్రోటీన్ షేక్:
వ్యాయామం చేసే వారు ఈ ప్రోటీన్ షేక్ ను ఎక్కువగా ఇష్టపడతారు.. కండరాలు , అవయవాల పనితీరు మెరుగు పడి.. చర్మం ఆరోగ్యంగా ఉండటం ఇలా అన్నింటికీ కూడా ఈ ప్రొటీన్ షేక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అథ్లెట్ లను మొదలుకొని క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరు తమ దినసరి వ్యాయామానికి ముందు తప్పకుండా ప్రోటీన్ షేక్ సేవిస్తారు.

వీటితో పాటు పెరుగు, అరటిపండు, పీనట్ బట్టర్ వంటివి తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: