ప్రస్తుత రోజుల్లో చాలా మంది షుగర్, బిపి వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో ఎంతో మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది కూడా గుండె సంబంధిత వ్యాధులకు ఒక కారణంగా ఉంటోంది. అయితే ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతోంది. అసలు కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరం లేదా ఒకవేళ అవసరం అయితే పరిమితి ఎంత అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ ది ప్రధాన మూలం అని చెప్పాలి. ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగినట్లైతే అదే సమయంలో గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది అని చెబుతున్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు.  అయితే ఎల్‌డిఎల్‌ కు 'సాధారణ స్థాయి' అంటూ ఏమీ లేదని ....  ఇప్పటికే గుండె జబ్బులు ఉండే వారు అయితే ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్‌ కంటే తక్కువగా ఉండాలని తాజా పరిశోధనలు చెబుతున్న మాట.

హెచ్‌డిఎల్‌ అనేది పురుషుల్లో అయితే 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో అయితే 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే గుండె సంబంధిత బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

అవసరమైన ఆహార నియమాలు...

టీ లు కాఫీలు మాని గ్రీన్‌ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుని అలాగే హెచ్‌డీఎల్‌ స్థాయిని కూడా పెంచుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు .

* అలాగే మీ రోజువారీ  ఆహారంలో అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని  ఉపయోగించడం వలన కూడా కొలెస్ట్రాల్‌ సమస్యను తగ్గించుకోవచ్చు.

* మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. మెంతులను నాన పెడితే శరీరానికి మరింత మంచిది.

* ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్, విటమిన్‌ సి లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన కూడా కొలెస్ట్రాల్‌ ప్రభావం తగ్గుతుంది. మొలకెత్తిన విత్తనాలను రోజు అల్పాహారంగా తీసుకోవడం కూడా చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: