పులిపిర్లు అనేవి వయసుతో సంబంధం లేకుండా కొందరికి ఎక్కడో ఒకచోట ఉండనే ఉంటాయి. ఇది ఆకారాలలో చాలా భిన్నంగా ఉండడమే కాకుండా అనేక రకాల ఆకారాల శరీరం పైన చాలా అంద విహీనంగా కనిపిస్తూ ఉంటాయి. పులిపిర్లు రాగానే మనలో చాలామంది కంగారుపడి మార్కెట్లో దొరికేటువంటి కొన్ని క్రీములు వాడుతూ ఉంటారు. వీటివల్ల పలు సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే ఇలాంటి వాటికి ఇంటి చిట్కాలను పాటించి తొలగించవచ్చని తెలియజేస్తున్నారు వాటి గురించి తెలుసుకుందాం.

1). పులిపిర్లు పోవాలి అంటే పసుపు, సున్నం, వంటసోడా ఇలా మూడిటిని ఒక టీ స్పూన్ లో తీసుకొని బాగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ ని పులిపిర్లపైన ఉంచి కొద్దిసేపు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేసినట్లు అయితే పులిపిర్లు రాలిపోతాయి.

2). ఇక మరొక పద్ధతి ఏమిటంటే రాత్రి నిద్రపోయే సమయంలో ఆవు నెయ్యిలో కాస్త మిరియాల పొడి వేసుకొని బాగా కలిపి.. రాత్రి సమయంలో రాగి పాత్రలోని కొన్ని తులసి ఆకులను వేసి వేసి ఆకులను బాగా నూరి పులిపిర్లు ఉన్నచోట పట్టించడం వల్ల నెమ్మదిగా రాలిపోతాయట.

3). అయితే పులిపిర్లు రావడానికి ముఖ్య కారణం రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. అందుచేతనే రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండేలా ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

4). ఇక రోగ నిరోధక శక్తి పెరగడానికి పలు ఆకుకూరలు కోడిగుడ్లు , మాంసం వంటి నెలలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు తింటూ ఉండాలి. అలాంటప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి పులిపిర్లు వంటివి రావు.


5). ముఖ్యంగా పులిపిర్లు వంటివి కాల్చడం చాలా ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. అది కాల్చడం వల్ల అలాగే మచ్చలు లాగా ఏర్పడి ఉండడమే కాకుండా చాలా అందవిహీనంగా కనిపిస్తాయి. ఇక అందులో ఉండే పదార్థం బయటికి వచ్చి చర్మం మీద అలర్జీల ఏర్పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: