ప్రస్తుత కాలంలో పాలల్లో తీపి పదార్థాల తయారీలో పంచదారను వాడడానికి బదులుగా డేట్ సిరప్ ను ఎక్కువగా వాడుతున్నారు. డేట్స్ తో చేసే ఈ సిరప్ చాలా రుచిగా ఉంటుంది. ఈ హెల్తీ సిరప్ ను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సిరప్ తయారీలో ఎక్కువగా కార్న్ సిరప్ ను ఎక్కువగా వాడతారు.అలాగే ప్రక్టోజ్ ఎక్కువగా ఉండే షుగర్ సిరప్ లను కూడా ఇందులో ఎక్కువగా కలుపుతూ ఉంటారు.దీనిలో ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇంకా వివిధ రకాల ప్లేవర్స్ ను ఎక్కువగా కలుపుతూ ఉంటారు. ఇలా తయారు చేసిన డేట్స్ సిరప్ ను తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడతాము. అయితే ఎటువంటి కార్న్ సిరప్ లు కలపకుండా, ప్రిజర్వేటివ్స్ కలపకుండా న్యాచురల్ గా ఈ డేట్ సిరప్ ను మనం ఇంట్లో  తయారు చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్ గా తయారు చేసుకున్న సిరప్ ను చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా తీసుకోవచ్చు. ఖర్జూర పండ్లతో న్యాచురల్ గా ఈ సిరప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందు కోసం ముందుగా అరకిలో ఖర్జూర పండ్లను తీసుకుని వాటిలో గింజలు తీసేసి 40 నిమిషాల పాటు నీటిలో బాగా నానబెట్టాలి.


ఆ తరువాత ఈ ఖర్జూర పండ్లను ఒక లీటర్ నీటిలో వేసి బాగా మెత్తగా ఉడికించాలి.ఇలా ఉడికించిన పండ్లను చేత్తో మెత్తగా చేసుకుని బాగా వడకట్టుకోవాలి.ఇక ఇలా వడకట్టగా వచ్చిన సిరప్ ను మరలా గిన్నెలో పోసి కొద్దిగా దగ్గర పడే దాకా ఉడికించాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే డేట్ సిరప్ తయారవుతుంది. ఈ సిరప్ ను గాజు సీసాలో తీసుకుని ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేయాలి. అయితే పిల్లలకు జామ్ కు బదులుగా ఈ సిరప్ ను బ్రెడ్ తో కలిపి కూడా ఇవ్వవచ్చు. అలాగే ఫ్రూట్ జ్యూస్ లలో ఇంకా వెజిటేబుల్ జ్యూస్ లలో ఈ సిరప్ ను కలిపి కూడా తీసుకోవచ్చు. పండ్ల ముక్కల మీద కూడా రుచి కోసం ఈ సిరప్ ను కలిపి ఇవ్వవచ్చు. చక్కెర వాడకాన్ని తగ్గించి అందుకు బదులుగా ఈ డేట్ సిరప్ ను తీసుకోవచ్చు. ఈ సిరప్ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కూడా కలుగుతాయి. దుష్ప్రభావాలు కూడా అసలు ఉండనే ఉండవు. చక్కెరకు బదులుగా ఈ సిరప్ ను తీసుకోవడం వల్ల కఫం, దగ్గు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే సంబంధించిన సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.ఇంకా అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: