గుండెసంబంధిత రోగాలు స్త్రీల కంటే పురుషులకి ఎక్కువగా వస్తూంటాయి. దానికి కారణం వారిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్, మరియు పని ఒత్తిడి మొదలగు కారణాలు కావచ్చు. పురుషులు గుండె సంబంధిత రోగాలు రాకుండా చూసుకోవాలి అంటే ఈ ఐదు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే..!
అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..!

1. డైట్ పేరుతో పురుషులు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు.వీరు సాధారణ ఆహారం కాకుండా ప్రోటీన్ వారి ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. అధిక ప్రోటీన్ వల్ల కూడా సంబంధిత రోగాలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున సమతుల ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

 అధిక బీపిని తగ్గించుకోవడం..
క్రమం తప్పకుండా బిపిని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అధికఒత్తిడికి గురికాకూడదు.  అధిక బీపీ గుండెపోటుకు దారితీస్తుంది.

 చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించుకోవడం..
 రక్తంలో చక్కర స్థాయిలను తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. బ్లడ్ లో ఉన్న అధిక షుగర్ లెవెల్స్ మధుమేహానికి గురి చేయడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. రక్తసరఫరాని అడ్డుకుంటుంది. దీనికోసం సరైన పద్ధతిలో, సరైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.

 చెడుఅలవాట్లకు దూరంగా ఉండడం..
మద్యపానం మరియు ధూమపానం వంటి చెడుఅలవాట్లను ఖచ్చితంగా మానివేయాలి. వీటివల్ల శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని, గుండె సంబంధిత రోగాలకు దారితీస్తుంది.

ఒత్తిడి తగ్గింపు..
 మగవారు రకరకాల కారణాల వల్ల అధిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు.కానీ ఎక్కువ కాలం పాటు ఒత్తిడికీ గురవుతూ ఉంటే అది రక్తపోటులో మార్పులకు కారణమవుతుంది. ఇది జీవనశైలిని దెబ్బతీస్తుంది.

 అధిక బరువును తగ్గించుకోవడం..
ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లు, జీవనశైలి అధిక బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంది. కావున ప్రతి ఒక్కరు సమతుల ఆహారాన్ని తీసుకొని, తగిన వ్యాయామం చేయడం వల్ల అధికబరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

 తగినంత నిద్ర..
ఎంతటి పని ఒత్తిడి భారాన్నైనా తగినంత నిద్రపోవడం వల్ల తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కనీసం 6లేదా 7 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. అప్పుడే శరీరానికి తగినంత విశ్రాంతి దొరికి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: