దూమపానం హానికరం అని చెపుతూనే ఉన్నా ఇవాళ రేపు ఈ అలవాటు మానుకోవడం మాత్రం ఎవరికైనా అంత సులభం గా మాత్రం లేదు. పైగా చాలా మందికి ఒక దమ్ము పిలిస్తే తప్ప బుర్ర పనిచేయదు అనేస్తుంటారు. కొందరు చైన్ స్మోకర్స్ ఉంటారు. వీళ్లు నిద్ర లేవటంతో మొదలు పెట్టి, ప్రతి పనికి ముందు అనంతరం కూడా ఒక సిగరెట్ తాగాల్సిందే. ఇలాంటి వారి తో జీవించే వారికీ కూడా ప్రమాద స్థాయిలో ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం దూమపానం చేసిన వారికే కాదు, దానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా ప్రమాదంలో ఉన్నట్టే అని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు.  

దీనితో ఇటీవల కాస్త దూమపానం పబ్లిక్ ప్రదేశాలలో తాగరాదని తెలియజేసింది కోర్టు. ఈ ఆదేశాలు అమలులో ఉన్న కారణంగా ఇటీవల పబ్లిక్ ప్రదేశాలలో దూమపానం చేసేందుకు కాస్త జంకుతున్నారు. ఇది కాస్త ఆహ్వానించదగ్గ పరిణామం. అయినా పొగ అభిమానులు మాత్రం ప్రత్యేక ప్రదేశాలు వెతుక్కొని మరీ దూమపానము చేస్తున్నారు. ప్రజల సంచారం ఉన్న ప్రాంతాలలో దూమపానం చేయవద్దు అన్నారు అని ఇళ్లలో కాల్చడం ఎక్కువ చేస్తున్నారు. తద్వారా వారితో ఉన్న ఇంటి సభ్యుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడుతున్నారు. ఈ ప్రమాదం అనుకున్నంత త్వరగా రానప్పటికీ, వివిధ రూపాలలో వస్తుంది.

ఉదాహరణకు ఒక ఇంట్లో భార్య గర్భవతి అయినప్పుడు అదే ఇంట్లో భర్త కు దూమపానం అలవాటు ఉంటె, భార్య గర్భవిచ్చితి జరిగే అవకాశాలు ఎక్కవుగా ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. ఒకవేళ ఈ భార్యాభర్తలకు సంతానం కలగకపోవడం లాంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. భర్త ధూమపానం మనుకోకుండా భార్య సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా చాలా సార్లు ఫలితం ఉండకపోవచ్చనేది వైద్యుల వాదన. ఇవన్నీ గుర్తుపెట్టుకొని సంతానం కావాలి అనుకున్నా లేక గర్భవతిగా ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు దూమపానం చేయకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. అప్పుడే గర్భస్రావానికి దారి తీయకుండా దంపతులు తల్లిదండ్రులు కావచ్చని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: