చిన్న పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా ఎత్తుకోవ‌డం అంత మంచిది కాదు అని మ‌న పెద్ద‌లు అంటుంటారు. ఎందుకంటే ఒక‌ప్పుడు అంద‌రూ క‌లిసి ఉండేవారు. ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవి. దాంతో పిల్ల‌ల‌ను ఎత్తుకోవ‌డానికి చూసుకోవ‌డానికి పెద్ద‌మ్మ‌లు, నాయ‌న‌మ్మ‌లు, చిన్న‌మ్మ‌లు ఇచా ఇంటినిండా మ‌నుషులు ఉండేవారు. అప్పుడు త‌ల్లి ప‌నిలో ఉన్నా ఆ పిల్లాడి ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డానికి ఎవ‌రో ఒక‌రు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఉద్యోగాల రిత్యా భ్యార్యాభ‌ర్త‌లిద్ద‌రూ వేరు కాపురం పెడుతున్నారు. దీంతో పిల్ల‌ల‌ను చూసుకునేవారు త‌క్కువ‌య్యారు పెద్ద‌లు ఎవ్వ‌రూ కూడా ఉండ‌క‌పోవ‌డంతో చాలా క‌ష్టంగా ఉంటుంది.  దీంతో పిల్ల‌లు ఏడ‌వ‌గానే వారి త‌ల్లిదండ్రులు ఎత్తుకుంటూ ఉంటారు. అలా చేయ‌కూడ‌దు. పిల్ల‌లు ఏడిస్తే వారికి ఏద‌న్నా బొమ్మ‌లు ఇచ్చి లాలించాలి త‌ప్పించి ఎత్తుకోవ‌డం అనేది మాత్రం అస‌లు అల‌వాటు చెయ్య‌కూడ‌దు. 

 

ఒక‌సారి ఎత్తుకుని తిర‌గ‌డం నిద్ర‌పుచ్చ‌డం లాంటివి చేసి అల‌వాటు చేశారంటే. ప‌సిపిల్ల‌లు దానికి అల‌వాటు ప‌డిపోతారు. దాంతో వాళ్ళు ఎత్తుకుంటేగాని నిద్ర‌పోరు. ఇక భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ గ‌నుక ఉద్యోగ‌స్తులైతే పిల్ల‌ల‌ను పెంచ‌డం మ‌రింత క‌ష్ట‌మ‌వుతుంది. అందులో కొంద‌రు షిఫ్ట్ వైజ్‌పిల్ల‌ల‌ను పెంచుకుంటూ వ‌స్తారు. ఒక‌రు వెళ్ళ‌గానే మ‌రొక‌రు పిల్ల‌ల బాధ్య‌త‌ను తీసుకుని చూసుకుంటూ వ‌స్తారు. ఈ రోజుల్లో ఇలాంటివారు చాలా మందే ఉన్నారు. త‌ల్లి ఉన్నంత సేపు త‌ల్లిద‌గ్గ‌ర ఉండి ఆ త‌ర్వాత త‌ల్లి ఉద్యోగానికి వెళ్ళ‌గానే ఆ బాధ్య‌త‌ను తండ్రి తీసుకుంటారు. త‌ల్లిలానే లాలించి ఎంతో చ‌క్క‌గా అన్ని ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు నేటి తండ్రులు. త‌ల్లి లాల‌న‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటారు తండ్రులు కూడా. ఇక అదే విధంగా పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా ఎత్తుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే వేడి మొత్తం వాళ్ళ‌కు వెళుతుంది అని పెద్ద‌లు అంటుంటారు. 

 

కాబ‌ట్టి ఒక‌ర‌కంగా అది కూడా మంచిది కాదు. అంతే కాక ఎక్కువ‌గా పిల్ల‌ల‌ను ఎత్తుకుని తిర‌గడం అనేది అల‌వాటు చేయ‌డం వ‌ల్ల వాళ్ళ‌కు కూడా అనుకోకుండా చిన్న చిన్న ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. అవేమిటంటే... ఎక్కువ‌గా ఎత్తుకోవ‌డం వ‌ల్ల పెద్ద‌వారికి వెన్నుముక్క‌లో నొప్పి రావ‌డం అలాగే కొంత బ‌ల‌హీన‌త అనేది కూడా ఏర్ప‌డుతుంది. అది ఎందువ‌ల్ల‌న‌న‌గా నేడు తినే ఆహార లోపం కూడా కొంత ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న యాంత్రిక జీవితంలో ఏదో ఒక‌టి తింటూ క‌డుపునింపుకోవ‌డం త‌ప్పించి ప్ర‌త్యేకంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోక‌పోవ‌డం కూడా ఒక లోపం అని చెప్పొచ్చు. దీంతో పిల్ల‌ల‌ను ఎక్కువగా ఎత్తుకుని తిరిగితే వారికే కాక మ‌న‌కు కూడా కాస్త ఇబ్బంది క‌లిగించే క‌రాణాలు ఎన్నో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: