మధు మేహం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఒక్కసారి వస్తే చనిపోయేదాకా పోదు. బాగా ఇబ్బంది పెడుతుంది. దాన్ని నియంత్రించుకోవడమే తప్ప వేరే దారే లేదు.మెంతి ఆకులలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకులు లేదా గింజలను తింటే, రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. వేప ఆకులు చేదుగా ఉండవచ్చు కానీ అవి ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. వేప ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఇది మంచిది.కరివేపాకు డయాబెటిక్ రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అలాగే ఫైబర్ జీర్ణక్రియ రేటును తగ్గిస్తుంది. మామిడి ఆకులులో పెక్టిన్, విటమిన్ సి ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, మామిడి ఆకులు అధిక రక్త చక్కెర, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి చాలా మంచివి. ఈ ఆకులను ఉడకబెట్టి రాత్రాంతా ఆ నీటిలోనే ఉంచి ఉదయాన్నే వాటిని వడగట్టి తాగితే మంచిదట.మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి అశ్వగంధ ఆకులు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే ప్రముఖ హెర్బ్ ఇది. 


అశ్వగంధని భారతీయ జిన్‌సెంగ్ అని కూడా పిలుస్తారు. మధుమేహానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ ఆకులను ఎండబెట్టి ఆతర్వాత పొడి చేసి గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే మధుమేహం నియంత్రించవచ్చట.మధుమేహ ఉన్నవారు షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోకపోతే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, రోగులు కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి డాక్టర్ సూచించే మందులతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం. ప్రకృతిలో ఇలాంటి ఆకుపచ్చ ఆకులు ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: