రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది?

కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కోడి గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అసలు అంతా ఇంతా కాదు. అందుకే ఆరోగ్య నిపుణులు దీన్ని రోజూ తినాలని కూడా చెబుతుంటారు. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా పుష్కలంగా ఉంటాయి. అయినా గుడ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.వీటిని ప్రతి రోజూ తినాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.. అయితే వాటిని ఓ మోతాదులో మాత్రమే తినాలని.. ఎక్కువుగా తినడం మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుడ్డును సూపర్ ఫుడ్ ఇంకా హెల్తీ ఫుడ్ అంటారు. ఇది మంచి సంపూర్ణ ఆహారం.ఇంకా అలాగే దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. 


ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును తింటే రోజంతా కూడా చాలా ఎనర్జిటిక్ గా, హుషారుగా ఉంటారు. అయితే అసలు రోజుకు ఎన్ని గుడ్లను తినాలి.. ఒకవేళ గుడ్లను రోజులో ఎక్కువ సార్లు తింటే ఏమౌతుందో ఇప్పుడు మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం.సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుంది. దీని నుంచి అతని శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అనేవి బాగా అందుతాయి. అయితే ఇది మన జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు కూడా లేనట్టైతే మూడు గుడ్లను మీరు రోజూ తినొచ్చు. రోజూ రెండుకంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్లు ఖచ్చితంగా రెగ్యులర్ గా వ్యాయామం చేసే వారై ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అనేది అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుడ్ల నుంచే చాలా ఎక్కువగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: