మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నిద్ర పోవడం కొద్దిమందికి అలవాటు. ఇలాంటి కునుకుతో ఎన్నో ఆరోగ్ ప్రయోజనాలు కలుగుతాయని ఎన్నో పరిశోదనల్లో నిరూపించబడ్డాయి. కానీ మధ్యాహ్నం అధికంగా నిద్రపోవడం కూడా అంత మంచిది కాదు. అసలు మధ్యాహ్నం కునుకుతో వచ్చే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మధ్యాహ్నం కునుకు తీయడం కేవలం చిన్న పిల్లలకే కాదు, పెద్దలకు కూడా చాలా మంచిది.మధ్యాహ్నం నిద్రతో ఉదయం నుంచి తెలుసుకున్న విషయాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.దీనిద్వారా మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు.ఒత్తిడి, ఆందోళనలు, బీపీ వంటివి తగ్గుతాయి.


1).అంతేకాదుమధ్యాహ్నం పూట కునుకు తీసేవారు క్లిష్ట సమస్యలు, చిక్కులు చక్కగా, సమర్థవంతంగా పరిష్కరిస్తారట.మధ్యాహ్నం కొంతసేపు నిద్ర వల్ల మిగిలిన రోజంతా చురుకుగా పనిచేస్తారట.


2).మధ్యాహ్నంపూట భోజనం తర్వాత నిద్ర రావడం అత్యంత సాధారణం. ఉదయం నుంచి అప్పటి వరకు శ్రమించడం, భోజనం ద్వారా గ్లూకోజు స్థాయి పెరగడంతో శరీరం విశ్రాంతిని కావాలనుకుంటుంది.


3).ఇక మధ్యాహ్నం నిద్ర అన్నది 30 నిమిషాలకు మించి నిద్రపోకూడదు. అధికంగా నిద్రపోతే బద్ధకానికి దారితీస్తుంది. దీంతో మిగిలిన రోజంత ఉత్సాహంగా ఉండలేరు.ఎవరికైనా కాఫీ ద్వారా వచ్చే హుషారు కంటే కూడా మధ్యాహ్నం స్వల్ప సమయం కునుకుతో వచ్చే ప్రయోజనమే ఎక్కువని కొన్ని అధ్యయనాలు తెల్చాయి.


4).రాత్రిపూట ఎక్కువ నిద్రపోలేనివారు మధ్యాహ్నం  20 నిమిషాలు పాటు నిద్రపోవడం చాలామంచిది.
ఇక మధ్యాహ్నం నిద్రతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని పరిశోధకులు, పరిశోధించి మరీ నిరూపించారు.


అధికనిద్ర వల్ల కలిగే దుషప్రభావాలు..
మధ్యాహ్నం గంటకన్నా ఎక్కువ సమయం నిద్రపోతే, అది రాత్రినిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్ర అంత ఉపయోగకరం కాదు. ఇక మధ్యాహ్నం ఎక్కువ సమయం నిద్రవల్ల మగత అనిపిస్తుంది. ఇలాంటి అధికసమయం నిద్రించేవారికి టైప్-2 మధుమేహం, గుండెసంబంధిత సమస్యలు, జీర్ణసమస్యలు అధికమవుతాయి . అందుకని మధ్యాహ్నం చిన్న కునుకు తీయడానికే పరిమితం కావడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: