చాలా ఇళ్లలో చూస్తుంటాం, ఆడవాళ్లు స్టిక్కర్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒకప్పుడు అలాంటిది కాదు. అప్పట్లో కుంకుమ, తిలకం, కాటుక ఎక్కువగా పెట్టుకునేవారు. అవి ఒక్కసారి ముఖం కడిగితే పోయేవి. తర్వాత మళ్లీ కొత్తగా వేరే తిలకం లేదా కుంకుమ పెట్టుకునేవారు. అప్పుడు ఆడవాళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువగా ఉండేది.కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, కల్చర్ మారిపోయింది. కొంతమంది ఆడవాళ్లు డ్రెస్‌కి తగ్గట్టు రకరకాల స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు అయితే బొట్టు పెట్టుకోవడమే మానేస్తున్నారు.
 

పెళ్లయిన మహిళలకు బొట్టు, గాజులు, పూలు, మెట్టెలు, తాళిబొట్టు ఎంత ముఖ్యమో మరిచిపోయి, నేటి ట్రెండ్ ఫాలో అవుతూ బొట్టు లేకుండా, గాజులు లేకుండా, కేవలం వాచ్‌ పెట్టుకుని, తాళి లేకుండా, మెట్టెలు లేకుండా తిరుగుతున్నారు. అలాంటి వారిని పెద్దవాళ్లు కొన్నిసార్లు మందలించినా పెద్దగా పట్టించుకోవడం లేదు.మరి కొంతమంది ఆడవాళ్లు మాత్రం, "కుంకుమ పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ అవుతుంది" అని చెప్పుకుంటూ, మార్కెట్‌లో దొరికే రకరకాల స్టిక్కర్లను వాడుతున్నారు. అంతేకాదు, ఒక స్టిక్కర్ ఒక రోజే పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుందని, వాడిన స్టిక్కర్‌ను గోడకు లేదా అద్దానికి అంటించి, మరుసటి రోజు మళ్లీ ముఖం కడుక్కొని అదే స్టిక్కర్‌ను తిరిగి పెట్టుకుంటున్నారు. చాలా ఇళ్లలో ఇది మనం గమనించే విషయమే.కానీ ఇలా చేయడం చాలా తప్పు అని పండితులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ విధంగా పదే పదే వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఒకసారి పెట్టుకున్న బొట్టును మళ్లీ వాడకూడదని, అలాగే ఒకరు వాడిన బొట్టును ఇంకొకరు పెట్టుకోవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా ఒకరు వాడిన బొట్టును మరొకరు వాడడం చెడు శకునంగా పరిగణిస్తారు.అసలైన సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్లు చక్కగా కుంకుమ పెట్టుకోవడమే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పేరుతో స్టిక్కర్లు ఎక్కువగా వాడుతున్నారు. అదీ ఒకటే కాదు, ఒక స్టిక్కర్‌ను పదే పదే వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తున్నారు.



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొంత మంది పండితులు చెప్పిన విధంగా ఇవ్వబడినది. ఇది ఎంత వరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి: