
జుట్టుకు నూనెతో మసాజ్ చేయడం అనేది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు బలాన్నిచ్చి, పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె లేదా ఉసిరి నూనె వంటి సహజ నూనెలను గోరు వెచ్చగా చేసి తలకు సున్నితంగా మర్దనా చేయాలి. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేయడం మంచిది.
జుట్టు ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా అవసరం. ప్రోటీన్లు, విటమి
న్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కోడిగుడ్లు (ప్రోటీన్, బయోటిన్ కోసం), పాలకూర (ఐరన్, విటమిన్ ఎ, సి), కందగడ్డలు, క్యారెట్లు, నట్స్ (జింక్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్) వంటివి ఆహారంలో చేర్చుకోవడం జుట్టును బలపరుస్తుంది.
శరీరానికి నీరు ఎంత ముఖ్యమో, జుట్టు ఆరోగ్యానికి కూడా అంతే అవసరం. రోజుకు సరిపడా నీరు తాగడం వలన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండటానికి దోహదపడుతుంది. రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు బదులుగా, ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం మంచిది.
జుట్టును రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలి. కాలుష్యం, దుమ్ము కారణంగా జుట్టు రంధ్రాలు మూసుకుపోకుండా ఉండాలంటే వారానికి కనీసం 3 సార్లు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ఉపయోగించడం వలన జుట్టు మృదువుగా ఉంటుంది. కాలుష్యం, సూర్యరశ్మి జుట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు జుట్టును స్కార్ఫ్ లేదా టోపీతో కప్పుకోవడం లేదా హెల్మెట్ ధరించడం వలన ధూళి కణాలు, రసాయనాలు జుట్టును పాడు చేయకుండా కాపాడుకోవచ్చు