
ఈ పథకంలో భాగంగా భార్యాభర్తలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలకు రూ.100 .. అంటే రూ.200 చెల్లిస్తే ఆ తర్వాత ఏటా రూ.72,000 పెన్షన్ ని పొందవచ్చు. అయితే ఇందుకు గల ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే.. కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్నం భోజన కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చాకలి వారు, రిక్షా తొక్కే వారు, భూమి లేని కార్మికులు, నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, అలాగే నెలసరి ఆదాయం రూ.15,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న 18 నుంచి 40 యేళ్ళ లోపు మధ్య గల వారు అర్హులే.
30 ఏళ్లు ఉన్న.. వ్యక్తి నెలకు రూ.200 చెల్లిస్తే ఏడాదికి రూ.1200 అవుతుంది. వీరిలో 60 ఏళ్ళు నిండిన వ్యక్తి ఏటా రూ.36,000 పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ఫించను పొందే సమయంలో చెందాదారుడు మరణించినట్లు అయితే ఆ డబ్బునంత భాగస్వామికి అతను పొందే పెన్షన్లు 50 శాతం వరకు అందిస్తారట. కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ స్కీం ను సంప్రదించవలసి ఉంటుంది. అయితే అభ్యర్థులు కచ్చితంగా సేవింగ్ బ్యాంకు ఖాతా ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ ఆవ్వవలసి ఉంటుంది.