ఈ మద్య కాలంలో హిస్టారికల్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో చారిత్రాత్మక చిత్రాలంటే ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతున్నారు. తెలుగులో ఈ మద్య కాలంలో విడుదలైన బాహుబలి, రుద్రమదేవి తమిళ్ లో పులి లాంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది.బాలీవుడ్ లో ఆ మద్య హృతిక్ రోషన్ జోదా అక్భర్ సినిమా కూడా ఓ రేంజ్ లో ఆడింది. తాజాగా బాలీవుడ్ లో  మరో హిస్టారికల్ చిత్రం  'బాజీరావ్‌ మస్తానీ' రూపొందుతున్న విషయం తెలిసిందే.  18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా ‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం.  

రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో, సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంపై వివాదం నెలకొంది. 'బాజీరావ్‌ మస్తానీ' సినిమాకు వ్యతిరేకంగా బాజీరావ్ కుటుంబం నుండి మహరాష్ట్ర్ర ప్రభుత్వానికి లెటర్ అందింది. మహరాష్ట్ర్ర ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవీస్'కి బాజీరావ్ కుటుంబ సభ్యుల్లో ఒకరైన  ప్రసాద్ రావ్ పేష్వా చెబుతున్న ప్రకారం అసలు ఆ చిత్రంలో ఒక్కటి కూడా వాస్తవం లేదని చరిత్రను ఈ రీతిలో వక్రీకరించడం ఎంత వరకు న్యాయం అని ఆయన అన్నారు.  నేరాన్ని గుర్తించి ఈ విషయాన్ని పరిగణనలోకి తిసుకోవాలని విన్నవించుకున్నారు.

 'బాజీరావ్‌ మస్తానీ' పోస్టర్

Sanjay Bhansali’s ‘Bajirao Mastani’ trailer not impressive!

పీష్వా బాజీరావు పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. ఆయన భార్యలుగా దీపికా, ప్రియాంకలు కనబడనున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మరాఠా యోధుడు బాజీరావ్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు.  ఒక వేళ బాజీరావ్ కుటుంబ సభ్యులు అప్పీల్ ప్రకారం ఆ లెటర్ గన మహారాష్ట్ర ప్రభుత్వం  పరిగణలోకి తిసుకోంటే ఇంత ఖర్చు పెట్టి తీసిన 'బాజీరావ్‌ మస్తానీ' సినిమా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని అంటున్నా బాలీవుడ్ వర్గాలు. అంతే కాదు ఈ సినిమా డిసెంబర్ 18 న రిలీజ్ చేయబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: