బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎన్నో సంచలనాలకు నాంధి పలికిన విషయం తెలిసిందే. మంచి నటుడిగానే కాకుండా ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచాడు. హీరోయిన్ల పట్ల దురుసుగా వ్యవహరించడం తర్వాత వారిని కూల్ చేయడానిక గిఫ్ట్ లు పంపించడం కామన్..అంతే కాదు తోటి నటులపై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.  ఆ మద్య బాలీవుడ్ కింగ్ ఖాంగ్ షారూఖ్ ఖాన్ తో విభేదాలు వచ్చినట్లు  కరణ్ అర్జున్ సినిమా తర్వాత వీరి మద్య తేడాలు వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి.ఈ మద్య సల్మాన్ చెల్లెలు అర్పిత వివాహం తర్వాత ఇద్దరు కలిసిననట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ముంబైలో తన సోదరుడు సోహైల్ ఖాన్ రాబోయే చిత్రం ‘ఫ్రీకీ అలీ’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ విలేకరులతో మాట్లాడాడు.  తనపై ఇప్పటి వరకు ఎన్నో వివాదాస్పద వార్తలు వచ్చాయని వాస్తవానికి తనకు అందరూ చాలా మంచి స్నేహితులే బాలీవుడ్ లో సంజయ్‌దత్, షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్ మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నాడు. ‘‘ఇండస్ట్రీలో నాకు చాలామంది ఆడ, మగ స్నేహితులున్నారు. పక్షులు, జంతువులు కూడా నా స్నేహితులే. ఎవరి పేరని చెప్పగలను? ఇండ్రస్ట్రీ మొత్తం నా స్నేహితులే’’అని చమత్కరించారు.  

ఫ్రెండ్స్ ఎందరున్నా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కొందరే ఉంటారని చెప్పుకొచ్చాడు. సంజు(సంజయ్ దత్)ను తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్న  అతనంటే తనకు చాలా అభిమానమని అన్నారు. అంతే కాదు కత్రినా కైఫ్ కూడా నా స్నేహితురాలే’’ అంటూ నవ్వులు పూయించాడు. తన సోదరుడి ‘ఫ్రీకీ అలీ’ సినిమాతో పాటు కత్రినా నటించిన ‘బార్ బార్ దేఖో’ కూడా విడుదల అవుతోందని, కాబట్టి ఇప్పుడు తనవి రెండు దారులంటూ చమత్కరించాడు. ఏది ఏమైనా ఇప్పుడు బాలీవుడ్ లో సుల్తాన్ లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ నమోదు చేసుకున్న సల్మాన్ ఖాన్ ఆ మద్య తన వివాహంపై కూడా సటైర్లు వేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: